/rtv/media/media_files/2025/07/29/ai-2025-07-29-21-28-35.jpg)
Jobs with AI skill requirements offer 28 Percent higher salaries, Says Report
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తోనే ఉన్నాయి. ఏఐ వల్ల అనేక రంగాల్లో ముఖ్యంగా ఐటీ రంగాల్లో ఉద్యోగాలు కూడా పోతున్నాయి. చాలావరకు కంపెనీలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఏఐని వినియోగించి తమ కంపెనీ ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. దీని నుంచే లాభాలు పెంచుకోవాలని భావిస్తున్నాయి. మరో ఐదేళ్లలో ఏఐ వాడకం దాదాపు అన్ని రంగాల్లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ నైపుణ్యాలు పెంచుకోవాలని సూచనలు చేస్తున్నారు.
Also Read: స్పెర్మ్ టెక్ ఆఫీస్ సోదాల్లో షాకింగ్ దృశ్యాలు..డబ్బాల్లో వీర్యకణాలు..అండాలు
రాబోయే రోజుల్లో ఏఐ వల్ల ఉద్యోగులకు మంచి ప్రయోజనం ఉండనుందని, భారీగా వేతనాలు ఉండనున్నాయని ఓ సర్వే చెబుతోంది. బియాండ్ ది బజ్ అనే లేబర్ మార్కెట్ పరిశోధన సంస్థ దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం చూసుకుంటే ఐటీ రంగంతో పాటు ఇతర కంపెనీలు కూడా ఏఐని వాడుతూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఉద్యోగాలు పోతాయని తెలియక ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. కానీ ఏఐ నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రం ఇలాంటి ఆందోళన అక్కర్లేదు. తాజా సర్వే ప్రకారం ఏఐ స్కిల్స్ ఉన్న ఉద్యోగులు భవిష్యత్తులో 28 శాతం అధికంగా జీతాలు పొందే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.
Also read: పాకిస్థాన్ గుండెలపై దాడి చేశాం...దాడులు ఆపాలని ట్రంప్ చెప్పలేదు: మోదీ
ఏఐ స్కిల్క్ ఉన్నవాళ్లకి డిమాండ్
కేవలం టెక్ రంగంలో మాత్రమే కాదు, ఇతర రంగాల్లో కూడా ఏఐ స్కిల్స్ ఉన్నవారికి ఇదే స్థాయిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు పైగా ఉద్యోగ ప్రకటనలను పరిశీలించి ఈ నివేదికను తయారు చేశారు. దీని ప్రకారం చూసుకుంటే ముఖ్యంగా హెచ్, విద్య, ఫైనాన్స్, కంటెంట్ క్రియేటర్లు వంటి నాన్ టెక్నికల్ రంగాల్లో కూడా ఏఐ స్కిల్స్ ఉండేవాళ్లకు డిమాండ్ పెరగనుంది. వాస్తవానికి చూసుకుంటే ఏఐ ఆటోమేషన్ వల్లే చాలా రంగాల్లో ఉద్యోగాల లేఆఫ్స్ జరుగుతున్నాయి. అందుకే ఏఐ స్కిల్స్ పెంచుకుంటే ఉద్యోగంలో భారీగా జీతాలు పొందవచ్చని నివేదిక చెబుతోంది.
Also Read: భయపెడుతున్న ఐటీ ఉద్యోగాలు.. లక్షలాది మందిని తొలగిస్తున్న బడా కంపెనీలు
ఇదిలాఉండగా ప్రస్తుతం చాలామంది చాట్ జీపీడీ, జెమినై, కో పైలట్, డీప్‌సీక్ లాంటి ఏఐ టూల్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇలాంటి టూల్స్‌లో పరిజ్ఞానం పెంచుకుంటే ఉద్యోగ అవకాశాలు గత మూడేళ్లలో ఏకంగా 800 శాతం పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది. ఇప్పుడు ఏఐ కేవలం టెక్ రంగాల్లో మాత్రమే కాకుండా నాన్ టెక్నికల్ రంగాల్లోకి కూడా పూర్తిగా వెళ్లనుంది. నాన్ టెక్నికల్ రంగాల్లో పనిచేయాలనుకునే వాళ్లకు టెక్నికల్ డిగ్రీలు లేకపోయినా ఏఐ స్కిల్స్ ఉన్నా కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. అంతేకాదు ఏఐ స్కిల్స్ అవసరం లేని ఉద్యోగాలతో పోల్చి చూస్తే ఆ నైపుణ్యాలు ఉన్న ఉద్యోగాల్లో సగటున 15 లక్షలు ఎక్కువగా చెల్లించేందుకు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది. అందుకే ఏఐ స్కిల్స్ నేర్చుకోవడం ఉత్తమం అని నిపుణులు యువతకు సూచనలు చేస్తున్నారు.