Earthquake: రష్యాలో భారీ భూకంపం.. సునామీ బీభత్సం (VIDEO)

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి సమీపంలో 8.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్ తీరంలో సునామీ హెచ్చరిక జారీ చేసిందని జపాన్ వాతావరణ సంస్థ బుధవారం తెలిపింది. ఈ భూకంపం జపాన్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8:25 గంటలకు వచ్చింది.

New Update
Tsunami hits Russia

Earthquake:

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి సమీపంలో 8.0 తీవ్రతతో భారీ భూకంపం(Russia Earthquake) సంభవించింది. తూర్ప రష్యాలోని పసిఫిక్ తీరంలో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతంలో సునామీ వచ్చే అవకాశం ఉంది. దీంతో జపాన్‌కు సునామీ(Tsunami) హెచ్చరిక జారీ చేసిందని ఆ దేశ వాతావరణ సంస్థ బుధవారం తెలిపింది. జపాన్ టైం ఇండియా కంటే 3 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుంది. దీని ప్రకారం ఈ భూకంపం బుధవారం ఉదయం 8:25 గంటలకు సంభవించింది. ప్రాథమిక తీవ్రత 8.0గా నమోదైందని ఆ సంస్థ తెలిపింది.

జపాన్, పసిఫిక్ తీరం వెంబడి సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. జపాన్‌లోని నాలుగు పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్కైడో నుంచి భూకంపం దాదాపు 250 కిలోమీటర్లు (160 మైళ్ళు) దూరంలో ఉందని తెలుస్తోంది. రష్యా సముద్ర తీరంలో సుముద్రం విరుచుకుపడింది. 3 నుంచి 4 మీటర్ల వరకూ అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్ర తీరంలో ప్రజల్ని అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. తీరం వెంబటి ఇళ్లు, భవనాల్లోకి నీళ్లు వచ్చాయి.

ఈ భూకంప కేంద్రం భూఉపరితలం నుంచి 19.3 కిలోమీటర్ల (12 మైళ్ళు) లోతులో ఉన్నట్లు US జియోలాజికల్ సర్వే తెలిపింది. కమ్చట్కాలో ఎంత మేరకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని రష్యా నుంచి తక్షణ సమాచారం లేదు. హవాయికి దీపానికి మాత్రం సునామీ హెచ్చరిక జారీ చేయబడింది. ఇది దాదాపు హవాయిలో తక్కువ ముప్పు కలిగిన అలర్ట్. టోక్యో విశ్వవిద్యాలయ భూకంప శాస్త్రవేత్త షినిచి సకాయ్ NHKతో మాట్లాడుతూ.. సుదూర భూకంప కేంద్రం నిస్సారంగా ఉంటే జపాన్‌ను ప్రభావితం చేసే సునామీకి కారణమవుతుందని అన్నారు.

జపాన్ పసిఫిక్ అగ్ని వలయం అని పిలువబడే ప్రాంతంలో భాగం. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో ఒకటి. జూలై ప్రారంభంలోనే జపాన్ దేశంలో 5 భారీ భూకంపాలు 7.4 తీవ్రతతో కమ్చట్కా సమీపంలో సంభవించాయి. అతిపెద్ద భూకంపం 20 కిలోమీటర్ల లోతులో 180,000 జనాభా కలిగిన పెట్రోపావ్లోవ్స్క్ కమ్చట్స్కీ నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల (89 మైళ్ళు) దూరంలో వచ్చింది. 1952 నవంబర్ 4న కమ్చట్కాలో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర నష్టాన్ని కలిగించింది. కానీ అప్పుడు హవాయిలో 9.1 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడినప్పటికీ ఎలాంటి మరణాలు సంభవించలేదు.

Advertisment
తాజా కథనాలు