Uttar Pradesh: అది కడుపా లేక కబోర్డ్ అనుకున్నావా.. 29 స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు, 2 పెన్స్

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఓ యువకుడి కడుపులో నుంచి 29 స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లతో పాటు రెండు పెన్నులను డాక్టర్లు తొలగించారు. బుదెండ్ షహర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల సచిన్ గత కొంతకాలంగా మత్తు పదార్థాలకు బానిసైయ్యాడు.

New Update
man in Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని హాపూర్ జిల్లాలో ఓ యువకుడి కడుపులో నుంచి 29 స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లతో పాటు రెండు పెన్నులను డాక్టర్లు తొలగించారు. ఈ సంఘటన సోషల్ మీడియా(Social Media) లో వైరల్‌గా మారింది. బుదెండ్ షహర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల సచిన్ గత కొంతకాలంగా మత్తు పదార్థాలకు బానిసైయ్యాడు. అతని కుటుంబ సభ్యులు రిహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్చారు.

Also Read :  2025లో 2,417 మంది భారతీయులని గెంటేసిన అమెరికా

UP Man Swallowed Spoons Toothbrushes

అయితే, తనను డీ-అడిక్షన్ సెంటర్లో చేర్చినందుకు కోపంతో సచిన్ అక్కడ అందుబాటులో ఉన్న వస్తువులని మింగడం ప్రారంభించాడు. ఈ క్రమంలో, అతను 29 చెంచాలు, 19 టూత్‌బ్రష్‌లు, రెండు పెన్నులను మింగేశాడు. దీని వల్ల అతనికి తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు అతడిని హాపూర్‌లోని దేవ్ నందిని ఆసుపత్రికి తరలించారు.

అల్ట్రాసౌండ్, ఎక్స్-రే పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సచిన్ కడుపులో వస్తువులు ఉన్నట్లు గుర్తించి షాక్ అయ్యారు. డాక్టర్ శ్యామ్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం వెంటనే ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించింది. సుమారు మూడున్నర గంటల పాటు శ్రమించి, డాక్టర్లు ఆ వస్తువులను ఒకటొకటిగా బయటకు తీశారు.

ఈ అసాధారణమైన శస్త్రచికిత్స తర్వాత, డాక్టర్లు యువకుడి మానసిక స్థితి గురించి వివరించారు. ఈ రకమైన ప్రవర్తన సాధారణంగా మానసిక సమస్యలు ఉన్నవారిలో కనిపిస్తుందని, కోపం, ఒత్తిడి లేదా నిస్సహాయత వంటి భావాల కారణంగా వారు ఇలాంటి చర్యలకు పాల్పడతారని తెలిపారు. ప్రస్తుతం సచిన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని డాక్టర్లు వెల్లడించారు.

Also Read :  అదిరిపోయే స్కీమ్.. లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.11 లక్షలు ఎలాగంటే?

Advertisment
తాజా కథనాలు