/rtv/media/media_files/2025/09/27/us-deported-2025-09-27-08-27-05.jpg)
అమెరికా అక్రమ వలసదారులపై ఉక్కపాదం మోపుతోంది. ట్రంప్(Donald Trump) అధ్యక్ష పదవి చేపట్టిన నుంచి అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది అమెరికా ప్రభుత్వం. 2025 ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 2,400 మందికి పైగా భారతీయులను అమెరికా స్వదేశానికి పంపించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. అక్రమ వలసలను నిరోధించడంలో భారత్ కట్టుబడి ఉందని, అయితే చట్టపరంగా వలసలను ప్రోత్సహించాలని కోరుకుంటుందని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
#MEABriefing ||
— All India Radio News (@airnewsalerts) September 26, 2025
Between 20th January & 25th September, a total of 2417 Indian nationals were repatriated: @MEAIndia spokesperson Randhir Jaiswal on deportations from the US pic.twitter.com/q7NYOXyPwW
Also Read : రాహుల్–ప్రియాంక తీరు ఇండియన్ కల్చర్‌కు విరుద్దం.. BJP మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
US Deported Indians
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అమెరికా నుంచి 2,417 మంది భారతీయులని స్వదేశానికి తీసుకువచ్చామని ఆయన తెలిపారు. ఈ విషయంపై భారత్, అమెరికా మధ్య సన్నిహిత సహకారం ఉందని ఆయన వివరించారు. అమెరికాలో చట్టబద్ధమైన హోదా లేని భారతీయుల గురించి సమాచారం అందినప్పుడు, వారి పౌరసత్వాన్ని నిర్ధారించిన తర్వాత వారిని వెనక్కి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
కొంతమంది భారతీయులు ఏజెంట్ల మోసపూరిత హామీలతో లేదా అక్రమంగా అమెరికా(america) లోకి ప్రవేశిస్తున్నారని, దీంతో వారు అమెరికా వలస చట్టాలను ఉల్లంఘించాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ అక్రమ వలసలని నిరోధించడానికి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందని, ప్రజలకు చట్టబద్ధమైన వలసల గురించి అవగాహన కల్పిస్తోందని జైస్వాల్ తెలిపారు.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల(indians) సంఖ్య భారీగా ఉందని అంచనా. ఇటీవలి కాలంలో, ఈ అక్రమ వలసదారులపై అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. దీనిలో భాగంగా పెద్ద సంఖ్యలో భారతీయులను స్వదేశానికి పంపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి భారత్, అమెరికా రెండూ పరస్పరం సహకరించుకుంటున్నాయి. అయినప్పటికీ, డాలర్ కలలు కనే యువత ఇప్పటికీ అక్రమ మార్గాలను ఎంచుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వాలు మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : H1B వీసాల ఫీజు పెంపుపై భయమేళ.. భారతీయ ఉద్యోగులకు నో టెన్షన్!