Viral Video: షాపింగ్ చేస్తున్న మహిళ బ్యాక్ పాకెట్‌లో పేలిన ఫోన్.. భయంతో పరుగులు!

బ్రెజిల్‌లో ఓ మహిళ వెనుక పాకెట్‌లో మొబైల్ పెట్టి భర్తతో షాపింగ్ చేస్తోంది. ఒక్కసారిగా ఆ మొబైల్ పేలి మంటలు ఏర్పడ్డాయి. దీంతో ఆ మహిళ వెనుక భాగంతో పాటు చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

New Update
Viral Video brazil

Viral Video brazil Photograph: (Viral Video brazil)

Viral Video: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్(Smartphone) యుగం నడుస్తోంది. ఎక్కడ చూసినా కూడా అందరూ మొబైల్ పట్టుకునే కనిపిస్తున్నారు. నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి నిద్రపోయే వరకు మొబైల్ తోనే గడుపుతున్నారు. మొబైల్ పేలిపోవడం, ఛార్జింగ్(Mobile Charging) పెట్టినప్పుడు మంటలు రావడం వంటి ఘటనలు కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటుంటాం. ఇలానే మొబైల్ పేలిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చూడండి: Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

ఇది కూడా చూడండి: Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!

భర్తతో కలిసి షాపింగ్ చేస్తుండగా..

వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిల్‌లో ఓ మహిళ తన భర్తతో కలిసి సూపర్ మార్కెట్‌కి వెళ్లి షాపింగ్ చేస్తోంది. ఆమె వెనుక పాకెట్‌లో తన మొబైల్‌ను పెట్టుకుని ఉంది. ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో ఆమె వెనుక భాగంతో పాటు చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. చుట్టూ ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు కావడంతో వీడియో బయటకు వచ్చింది. 

ఇది కూడా చూడండి: supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిదే

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది తాజాగా జరిగిన సంఘటన కాదని, గతంలో జరిగిందని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా మొబైల్ ఫోన్‌తో కాస్త జాగ్రత్తగా ఉండండి. వెనుక పాకెట్‌లో మొబైల్ ఫోన్ పెట్టవద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Nara Lokesh: ఇక నుంచి క్యూఆర్ కోడ్‌తో రేషన్.. డిజిటల్ కార్డులు జారీ చేయనున్న ఏపీ సర్కార్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు