/rtv/media/media_files/2025/09/27/hyd-floods-2025-09-27-12-01-16.jpg)
Hyd floods
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో మూసీ నది పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ అయితే మునిగుతోంది. ఈ బస్ స్టేషన్‌కు వెళ్లే రెండు దారులు కూడా మూసుకుపోయాయి. వరద నీరు తీవ్రం కావడంతో బస్ స్టేషన్‌లోని నీరు ప్రవేశించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ, దసరా కావడంతో ప్రయాణికులు ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి గ్రామాలకు ఈ బప్ స్టేషన్ నుంచే ప్రయాణిస్తారు. భారీగా మూసీ నీరు చేరడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) నుంచి బస్సు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. MGBS నుంచి బయలుదేరాల్సిన అన్ని బస్సులను TGSRTC హైదరాబాద్‌లోని ప్రత్యామ్నాయ పాయింట్లకు మార్చినట్లు తెలిపింది.
ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు
🔸మూసీ వరదనీరు చేరిన నేపథ్యంలో ఎంజీబీఎస్ కు ప్రయాణికులు ఎవరూ రావొద్దన్న టీజీఎస్ఆర్టీసీ.
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) September 27, 2025
🔸వివరాలకు సంప్రదించాల్సిన కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033#TGSRTC#HelpLinepic.twitter.com/wQfdOPpv4m
ఇది కూడా చూడండి: Hyderabad: ఉప్పొంగిన మూసీ... మునిగిన ఎంజీబీఎస్
అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేేసే వరకు
మళ్లీ అధికారులు నోటీసులు తెలిపే వరకు MGBSని సందర్శించవద్దని కార్పొరేషన్ కోరింది. ఈ క్రమంలోనే కార్యకలాపాలను ఇతర డిపోలకు మార్చింది. ఆదిలాబాద్ , కరీంనగర్ , మెదక్, నిజామాబాద్ వైపు వెళ్లే బస్సు సర్వీసులను ఇప్పుడు జూబ్లీ బస్ స్టేషన్ (JBS) నుంచి నడుస్తాయని TGSRTC ప్రకటించింది. వరంగల్, హన్మకొండ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుండి నడుస్తాయి. సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులు LB నగర్ నుంచి ప్రారంభమవుతాయి. మహబూబ్‌నగర్ , కర్నూలు, బెంగళూరు వైపు సర్వీసులు ఆరాంఘర్ నుండి బయలుదేరుతాయని తెలిపింది. MGBS వద్ద వరద నీరు తగ్గి సాధారణ స్థితికి వచ్చే వరకు మళ్లింపులు కొనసాగిస్తామని కార్పొరేషన్ తెలిపింది. ప్రయాణికులకు బస్సుల విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే TGSRTC హెల్ప్‌లైన్‌లకు 040-69440000 లేదా 040-23450033 నంబర్లకు కాల్ చేయవచ్చు.