Ear Tips: చెవిలో గులిమి బాగా ఇబ్బంది పెడుతుందా.. ఇలా చేస్తే సమస్య క్లియర్

చెవిలోని గులిమిను బయటకు తీయడానికి పిన్నులు వంటివి వాడటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు. రెండు చుక్కల ఆలివ్ ఆయిల్‌‌ను చెవిలో వేయడం వల్ల గులిమి అంతా కూడా బయటకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
ear

ear

చెరువు, నది ఇలా స్నానం చేసేటప్పుడు చెవిలో గులిమి ఇబ్బంది పెడుతుంది. సాధారణంగా ఉంటుంది.. కానీ నీరు వెళ్తే ఇంకా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే చెవిలోని గులిమిని శుభ్రం చేయడానికి చాలా మంది హెయిర్ పిన్స్, కాటన్ బడ్స్ లేదా వేళ్లను ఉపయోగిస్తూ ఉంటారు. మరికొందరు చెవిలో గులిమి క్లీనర్లతో చెవులను శుభ్రం చేసుకుంటారు. దీనివల్ల చెవిలోకి గులిమి చేరే ప్రమాదం పెరుగుతుంది. వీటివల్ల చెవిలో ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Mosquito Drone: అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

నూనె వేయడం వల్ల..

ఈ గులిమి వల్ల కొన్నిసార్లు వినికిడి సామర్థ్యం కూడా కోల్పోయే ప్రభావం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే చెవిలోని గులిమిని తగ్గించడానికి మీరు ఎలాంటి పిన్నులు వాడక్కర్లేదు. ఈజీగా కొన్ని చిట్కాలు పాటిస్తే చెవిలోని గులిమిని బయటకు తీయవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే చెవిలోని గులిమిని తీయడానికి మీరు నూనె వేస్తే సరిపోతుంది. 

ముఖ్యంగా ఆలివ్ నూనెను రెండు చుక్కలు చెవిలో వేస్తే మాత్రం అందులోని పేరుకుపోయినదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దీంతో మార్కెట్‌లో లభ్యమయ్యే చెవి చుక్కలను కూడా తీసుకోవచ్చు. వీటిని చెవిలో వేయడం వల్ల కూడా అందులోని గులిమి అంతా కూడా బయటకు వస్తుందని నిపుణులు అంటున్నారు. పిన్నులు వంటివి వాడటం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Bike Stunts: HYDలో ఒకే బైక్‌పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో.. (వీడియో)

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Jeedimetla Murder: జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. నిందితురాలు చెల్లి ఏం చెప్పిందంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు