Asia Cup 2025: ఆసియా కప్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI.. కెప్టెన్ ఎవరంటే ?

ఆసియా కప్ 2025లో ఆడనున్న టీమిండియా జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ టీమ్‌కు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ కొనసాగనున్నారు. అలాగే శుభ్‌మన్‌ గిల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

New Update
BCCI Announces India's Asia Cup 2025 Squad

BCCI Announces India's Asia Cup 2025 Squad

ఆసియా కప్ 2025లో ఆడనున్న టీమిండియా జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ టీమ్‌కు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ కొనసాగనున్నారు. అలాగే శుభ్‌మన్‌ గిల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఇంతకుముందు గిల్‌ టెస్టు టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహిరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆసియా కప్‌ టీమ్‌లో స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యార్, స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు చోటు దక్కలేదు. ఇక వికెట్‌ కీపర్‌గా సంజూ శాంసన్, జితేశ్‌ శర్మను ఎంపిక చేశారు. వాషింగ్టన్‌ సుందర్‌, ధృవ్‌ జురెల్‌,యాన్‌ పరాగ్‌, యశస్వి జైస్వాల్‌, ప్రసిద్ద్‌ కృష్ణ  స్టాండ్‌ బై ప్లేయర్లుగా నియమితులయ్యారు. 

ఆసియా కప్ -2025 భారత టీమ్‌ ఇదే 

1.సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌)
2.శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌)
3.జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌)
4.సంజు శాంసన్‌ (వికెట్‌కీపర్‌)
5.హార్దిక్ పాండ్యా
6.శివమ్‌ దూబే
7.అభిషేక్ శర్మ
8.తిలక్ వర్మ
9.అక్షర్ పటేల్‌

10.జస్ప్రీత్‌ బుమ్రా
11.అర్ష్‌దీప్ సింగ్‌
12.కుల్దీప్ యాదవ్‌
13.రింకూ సింగ్
14.వరుణ్ చక్రవర్తి
15.హర్షిత్ రాణా

Also Read: సైలెంట్ గా సచిన్ టెండూల్కర్ కొడుకు నిశ్చితార్థం..ముంబైకు చెందిన వ్యాపార వేత్త మనువరాలితో..

ఆసియా కప్‌-2025 సెప్టెంబర్‌ 9 న యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 28 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిని టీ20 ఫార్మాట్‌లలోనే నిర్వహించనున్నారు. ఆసియా కప్‌లో టీమిండియా సెప్టెంబర్‌ 10న మొదటి మ్యాచ్‌ ఆడనుంది. సెప్టెంబర్ 14న భారత్‌, పాక్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇక లీగ్ చివరి మ్యాచ్‌లో సెప్టెంబర్‌ 19న ఒమన్‌తో టీమిండియా తలపడనుంది. 

Also Read: మీరు మారరారా ?.. భారతీయ యువతులపై పాకిస్థానీయుల చిల్లర చేష్టలు

Advertisment
తాజా కథనాలు