world cup: హైదరాబాద్ లో పాక్ క్రికెటర్ల సందడి...కట్టుదిట్టమైన భద్రత

ఏడేళ్ళ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్ లోకి అడుగు పెట్టింది. వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు వచ్చిన పాక్ క్రికెటర్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈరోజు వీరు న్యూజిలాండ్ తో మొదటి వార్మప్ మ్యాచ్ ఆడనున్నారు.

New Update
world cup: హైదరాబాద్ లో పాక్ క్రికెటర్ల సందడి...కట్టుదిట్టమైన భద్రత

వన్డే వరల్డ్ కప్ సందడి హైదరాబాద్ కి కూడా వచ్చేసింది. ఒకపక్క గణేష్ నిమజ్జనం, మరో వైపు పాక్, న్యూజిలాండ్ క్రికెటర్లతో హైదరాబాద్ హడావుడిగా మారిపోయింది. ఏడేళ్ళ తర్వాత ఇండియాకు వచ్చిన పాక్ క్రికెటర్లకు ఇక్కడ ఘన స్వాగతం లబించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా సిబ్బంది, ప్రయాణికులు జట్టుకు చేతులూపుతూ స్వాగతం పలికారు. స్థానికులు కొంతమంది పాక్ క్రికెటర్లను చూడ్డానికి ఎయిర్ పోర్ట్ కి కూడా వచ్చారు. బాబర్ ఆజమ్ అంటూ నినాదాలు చేశారు.

విమానాశ్రయం నుంచి పార్క్ హయత్ చేరుకున్న పాక్ జట్టుకు హోటల్ దగ్గర కూడా ఘన స్వాగతం లభించింది. ఏడేళ్ళ తర్వాత దాయాది జట్టు భారత్ కు రావడం అందరిలోనూ ఉత్సాహాన్ని నిలుపుతుంది. దీన్ని భారత్-పాక్ ల మ్యాచ్ కు ఎంతటి క్రేజ్ ఉంటుందో మనం ఊహించుకోవచ్చును. పాక్ జట్టు ఈరోజు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాంగ్ తో తలపడనుంది. న్యూజిలాండ్ జట్టు నిన్ననే హైదరాబాద్ చేరుకుంది. ఈ టీమ్ బేగంపేట్ లోని ఐటీసీ కాకతీయలో బస చేసింది. ఇరు జట్లకు ఇదే మొదటి వార్మప్ మ్యాచ్.

ఈరోజు గణేష్ శోభాయాత్ర, మిలాద్ ఉన్ నబీ దృష్ట్యా హైదరాబాద్ లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. క్రికెటర్లకు కూడా భారీ భద్రత ఉండేలా చూస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పాక్-న్యూజిలాండ్ మధ్య జరిగే వార్మప్ మ్యాచ్ కు కూడా ప్రేక్షకులను అనుమతించడం లేదు. కానీ ఈ ఒక్క రోజే ఈ నింబంధన వర్తిస్తుంది. అక్టోబర్ 3న జరిగే వార్మస్ మ్యాచ్ కు క్రికెట్ అబిమానులను అనుమతిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి విచారించగా...ఊరకనే సరదాగా చేశానని చెప్పాడు.వరల్డ్ కప్ లో అక్టోబర్ 6, 9, 10 తేదీల్లో మ్యాచ్ లు ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకోవచ్చును.

ఇక తమ టీమ్ వరల్డ్ కప్ లో బాగా రాణిస్తుందని ఆశాబావం వ్యక్తం చేశాడు పాక్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్. భారత్ లో పిచ్ ల మీద తమకు అవగాహన ఉందని చెప్పాడు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని...పూర్తిగా సన్నద్ధమై వచ్చామని చెప్పాడు. సొంత రికార్డుల కంటే జట్టు విజయానికే ప్రాముఖ్యతనిస్తానని చెప్పాడు బాబర్ ఆజమ్.

Advertisment
Advertisment
తాజా కథనాలు