/rtv/media/media_files/2026/02/16/kova-bun-issue-2026-02-16-16-14-18.jpg)
Kova Bun Issue
Kova Bun Issue: తెలంగాణలో జరిగే ప్రసిద్ధ సమ్మక్క-సరలమ్మ జాతరలో కోవా బన్స్ అమ్ముతున్న ముస్లిం వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ వీడియోలు విడుదల చేయడం పెద్ద చర్చకు దారి తీసింది. “తేజస్వి న్యూస్” అనే ఛానల్ గత కొన్ని రోజులుగా వరుసగా వీడియోలు పెట్టి, ఈ బన్స్ కల్తీగా ఉన్నాయని ఆరోపించింది. అంతేకాదు, “ఫుడ్ జిహాద్” అంటూ మతపరమైన కోణంలో వ్యాఖ్యలు చేయడం వివాదానికి కారణమైంది.
A street vendor from Kurnool, Andhra Pradesh, was made to eat his own food to prove he was not committing “food jihad” before a group of YouTubers during the Medaram Jatara in Telangana.
— The Siasat Daily (@TheSiasatDaily) February 13, 2026
After being publicly harassed by the YouTubers, he received support not only from residents… pic.twitter.com/bKFWAX9yZv
ఆ ఛానల్ యాంకర్ బాలు బాలాజీ గౌడ్ జాతరలో బన్స్ అమ్ముతున్న కర్నూలుకు చెందిన జావేద్, షావలి అనే వ్యాపారులను ప్రశ్నించారు. బన్స్ ప్యాకెట్లపై తయారీ తేదీ, గడువు తేదీ లేవని అడిగారు. తాము స్థానికంగా తయారు చేసినవి, కొన్ని రోజుల్లో అమ్మేస్తామని వారు చెప్పినా, ఆ వ్యాపారులను ఒత్తిడికి గురి చేసినట్టు వీడియోల్లో కనిపించింది. ఒక సందర్భంలో ఆ వ్యాపారిని బన్ తినమని కూడా అడిగారు.
కోవా బన్ అనేది పాలు, చక్కెరతో చేసే సాధారణ స్వీట్ ఐటమ్. దాన్ని తక్కువ ధరకు ఎలా అమ్ముతున్నారని అనుమానం వ్యక్తం చేశారు సదరు యూట్యూబర్లు. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురయ్యాయి. కొందరు ఇది ఆహార భద్రత విషయమని జాగ్రత్తలు పాటించాలని స్పందిస్తుండగా, మరికొందరు మతపరమైన ఆరోపణలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
Nara Lokesh on Kova Bun Issue
Dear Brother Vali, I am deeply sorry that you had to endure this. Such divisive and communal behavior has no place in our Telugu society, which has always stood for harmony, mutual respect, and brotherhood. I will meet you soon and look forward to tasting your famous Khoya bun!… https://t.co/AvckML9odY
— Lokesh Nara (@naralokesh) February 15, 2026
ఇటీవల “ఫుడ్ జిహాద్”, “తూక్ జిహాద్” వంటి పదాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఇలాంటి ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు లేవని పలుమార్లు ఫ్యాక్ట్ చెక్స్ వెల్లడించాయి.
ఈ ఘటనపై రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు కూడా స్పందించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల శ్రీరామ్ చిన్న వ్యాపారిని ఇలా అవమానించడం సరికాదన్నారు. యూట్యూబ్ వ్యూస్ కోసం ఇలా చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందిస్తూ, “వలీ” అనే వ్యాపారికి అండగా నిలిచారు. తెలుగు సమాజం ఎప్పుడూ ఐక్యతకు నిలబడుతుందని చెప్పారు. అతన్ని త్వరలో కలుసుకుని అతని కోవా బన్ రుచి చూస్తానని తెలిపారు. ఆయన సందేశాన్ని చాలా మంది అభినందించారు.
Nagababu on Kova Bun Issue
చిరువ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం భరోసాగా ఉంటుంది
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 15, 2026
పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవాబన్ను అమ్ముకుంటున్న సాధారణ పౌరుడుని కొందరు భయభ్రాంతులకు గురిచేయడం మంచి పరిణామం కాదు. ఈ సంఘటన తర్వాత చాలామంది చిరువ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన కారణంగా శివరాత్రికి తాను వ్యాపారం… pic.twitter.com/HbsnzrcaxR
జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా వలీకి మద్దతు తెలిపారు. లైకుల కోసం చిన్న వ్యాపారిని ఇబ్బంది పెట్టడం సరికాదని మండిపడ్డారు. వలీని కలిసి రూ.25,000 ఆర్థిక సాయం అందించారు. ఆహార నాణ్యత చూడటానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారని, చట్టాన్ని ఎవ్వరూ చేతిలోకి తీసుకోవద్దని సూచించారు.
ఈ సంఘటన ఒక చిన్న వ్యాపారి సమస్యగా మొదలై, ఇప్పుడు సామాజిక ఐక్యత, డిజిటల్ బాధ్యత, రాజకీయ వ్యాఖ్యలపై పెద్ద చర్చగా మారింది. ఒక జాతరలో జరిగిన ఈ ఘటన సమాజంలో పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో గుర్తు చేసింది.
Follow Us