Jeevan Reddy : అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ లో ఉండలేను..మాజీమంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అవమనాలు భరిస్తూ కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తున్నానని, భవిష్యత్‌ ఏంటో అర్థం కావడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అవమానాలు ఇంకెంతకాలం భరించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
FotoJet (8)

jeevan reddy

Jeevan Reddy : అవమనాలు భరిస్తూ కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తున్నానని, భవిష్యత్‌ ఏంటో అర్థం కావడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అవమానాలు ఇంకెంతకాలం భరించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో ఆయనకు విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆయన చేరికను వ్యతిరేకిస్తు వస్తున్న ఆయన ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల సమయంలో తన వర్గానికి టికెట్లు ఇప్పించుకునే విషయంలోనూ ఆయనతో విభేదించారు. చివరికి పార్టీ టికెట్లు రాని వారితో ఇండిపెండెంట్లుగా పోటీ చేయించడమే కాకుండా వారి తరుపున ప్రచారం కూడా చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులకే అవకాశం ఇవ్వాలని బలంగా వాదించారు. నిజమైన కాంగ్రెస్‌ వాదులకు టికెట్‌ ఇవ్వాలని కోరినప్పటికీ ఆయన మాట చెల్లలేదు. చివరికి సంజయ్‌ వర్గానికి చెందిన వ్యక్తి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. దీంతో జీవన్‌రెడ్డి అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.

‘‘ఈ ఎన్నిక ముగింపు కాదు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌ ఉన్నంతకాలం నాకు వేధింపులు తప్పవు. పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్‌కు రాసిచ్చారా? బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు జగిత్యాల కాంగ్రెస్ పట్టా రాసిచ్చారు.  ఎమ్మెల్యే పార్టీ మారలేదని స్పీకర్‌ అంటున్నారు. ఆయన మాత్రం కాంగ్రెస్‌ పార్టీతో సంసారం చేస్తున్నారు. కార్యకర్తల మనోభావాలను పార్టీ అధినాయకత్వం గౌరవించాలి. జగిత్యాలలోనే ఇలా ఉంటే.. పార్టీ మారిన మరో 9  ప్రాంతాల్లో ఎలా ఉందో..!’’ అని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించడం సంచనలంగా మారింది. అంతేకాక కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తున్నానన్నారు. తన రాజకీయ భవిష్యత్తు ఏంటో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఇంకెంత కాలం అవమానాలు భరించాలని ప్రశ్నించారు.  

Advertisment
తాజా కథనాలు