/rtv/media/media_files/2026/02/16/congress-2026-02-16-14-39-16.jpg)
Congress
నిజామాబాద్, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ రెండింటినీ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. నిజామాబాద్‌లో MIMతో కలిసి మేయర్ పదవిని కైవసం చేసుకుంది. మేయర్‌గా ఉమరాణి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ పదవి సల్మా తహసీన్‌కు వరించింది. ఇక మహబూబ్‌నగర్ మేయర్‌గా కాంగ్రెస్ నేత గుమల్ మమత ఎన్నికయ్యారు. కార్పరేటర్ల ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు.
Also Read: మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తలు..నాటకీయ పరిణామాలతో వాయిదాలు
కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్‌లో 17 స్థానాల్లో గెలిచింది. MIM 14 చోట్ల విజయం సాధించింది. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు, మరో బీఆర్ఎస్ అభర్థి సపోర్ట్‌తో కాంగ్రెస్ బలం 34కి చేరింది. ఇక్కడ మేయర్ పదవిని మహిళలకు రిజర్వ్ చేయడంతో ఉమారాణి, లలిత రేసులో ఉన్నారు. చివరికి కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా ఉమారాణిని ఎన్నుకుంది. MIM పార్టీ నుంచి 54వ డివిజన్లో గెలిచిన సల్మా తహెసీన్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇక్కడ బీజేపీ 28 స్థానాల్లో గెలిచింది. కానీ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు జతకట్టడంతో ఆ పార్టీకి మేయర్ పదవి దక్కలేదు.
Also Read: కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. స్పాట్ లో 8 మంది కార్మికులు
Follow Us