Municipal Elections : తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తం..

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్‌ ఎక్స్‌ అఫీషీయో ఓట్లతో గెలవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పూర్తి మెజారిటీ తమకే ఉందని బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది. ఎంపీ కడియం కావ్య ఓటు చెల్లదని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.  

New Update
FotoJet (5)

Thorrur Municipality

Municipal Elections : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో టెన్షన్ నెలకొంది. తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 18 ఓట్లు ఉన్నాయి. చైర్మన్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 10 ఓట్లు కాగా తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకారం బీఆర్ఎస్‌కు 9 వార్డులు, కాంగ్రెస్‌కు 7 వార్డులు దక్కాయి. అయితే ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. దీంతో రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడింది.

ఈ దశలో ఈ రెండు చైర్‌ పర్సన్‌ ఎంపిక కోసం 9మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులతో కలసి మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు  మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కాంగ్రెస్‌ ఎక్స్‌ అఫీషీయో ఓట్లతో గెలవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పూర్తి మెజారిటీ తమకే ఉందని బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది. అయితే ఎంపీ కడియం కావ్య ఓటు చెల్లదని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.  

2025 లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకున్న కడియం కావ్య ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీ ఓటు వేడయానికి సిద్ధం కావడం  ఉద్రిక్తతకు దారితీసింది. ఆమె ఓటు చెల్లదని బీఆర్‌ఎస్‌ శ్రేణులు అంటున్నారు. ఆమెపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఎక్స్ అఫిషియో గా ఎక్కడైతే ఓటు నమోదు చేసుకుంటారో, వారి పదవీ కాలం ముగిసే వరకు అక్కడే ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకున్నారని కమిషనర్ కు వారు ఫిర్యాదు చేశారు. మరికొద్ది క్షణాల్లో చైర్మన్ ఎన్నిక జరగున్న నేపథ్యంలో కమిషనర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో ఆయన కార్యదర్శి భాస్కర్ పై కాంగ్రెస్‌ నేతలు దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక సమయంలో రెండు పార్టీల శ్రేణుల మధ్య ఉద్రిక్తత తీవ్రమైంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పరిస్థితిని అదుపు చేయడం కోసం RAF బలగాలు రంగంలోకి దిగాయి.మున్సిపల్ కార్యాలయానికి 200 మీటర్ల బీఎన్ఎస్ 163 సెక్షన్ అమలు చేశారు.

Advertisment
తాజా కథనాలు