Municipal Elections : మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తలు..నాటకీయ పరిణామాలతో వాయిదాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిర్వహిస్తున్న మున్సిపల్‌ చైర్ పర్సన్‌, మేయర్‌ ఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్తలు, లాఠీచార్జీలు, రాళ్లదాడులు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది.

New Update
Political Heat Rises in Mahbubnagar Mayor Seat

Political Heat Rises i

Municipal Elections :

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిర్వహిస్తున్న మున్సిపల్‌ చైర్ పర్సన్‌, మేయర్‌ ఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్తలు, లాఠీచార్జీలు, రాళ్లదాడులు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది.
 
ఇబ్రహీం పట్నంలో రాళ్లదాడి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్ ఛైర్మన్‌ ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తం 24 వార్డులకు గాను 23 మంది గెలిచిన అభ్యర్థులు సోమవారం మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ బీఆర్‌ఎస్ పార్టీ 13 వార్డులను, కాంగ్రెస్ 8 వార్డులను గెలుచుకుంది. బీజేపీ 2 వార్డులను గెలుచుకోగా..ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. బీఆర్‌ఎస్, బీజేపీ, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో బీఆర్‌ఎస్‌ చైర్మన్‌ పీఠాన్ని ఆశించింది. అయితే  బీఆర్‌ఎస్ పార్టీలో ఛైర్మన్‌ పీఠాన్ని ఆశిస్తున్న ఆకుల యాదగిరి అనే అభ్యర్థి మిస్సవ్వడం ఉద్రిక్తతకు దారితీసింది.

అందరితో కలిసి క్యాంపునకు వెళ్లిన ఆకుల యాదగిరి మున్సిపల్‌ సమావేశానికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నిక వాయిదా వేయాలంటూ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగానే మున్సిపల్‌ కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో మున్సిపల్‌ కార్యాలయ కిటికీ అద్దం ధ్వంసం అయింది. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఇమ్రాన్‌ అయ్యాన్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఎన్నికను బహిష్కరించిన బీఆర్‌ఎస్‌ 

హుజూరాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియను బీఆర్‌ఎస్‌ బహిష్కరించింది.  బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరించి సమావేశ మందిరం నుండి వాకౌట్ చేశారు. ఎన్నికల అనంతరం​బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళాలను నిబంధనల ప్రకారం తీయలేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. తాళం చెవి పోయిందనే నెపంతో అధికారులు ఏకపక్షంగా తాళం పగలగొట్టడం పై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్య వెనుక ఏదో కుట్ర దాగి ఉందని, బ్యాలెట్ బాక్సుల భద్రత పై తమకు నమ్మకం లేదని వారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ​గందె శ్రీనివాస్, ​వర్దినేని రవీందర్రావు, కేసిరెడ్డి లావణ్య, ​బండ సింధుజ, ​బండ నరేష్, సమ్మరీన్, ​ప్రతాప తార, ​ప్రతాప మంజుల లు అధికారుల తీరును నిరసిస్తూ వారు చేసిన ఈ వాకౌట్‌తో మున్సిపల్ కార్యాలయం వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

క్యాతన్‌పల్లి ఎన్నిక వాయిదా

మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి(Kyathannapalli) మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. గడువు సమయానికి కౌన్సిలర్లు రాలేదని అధికారులు రేపటికి వాయిదా వేశారు. అయితే క్యాతన్‌పల్లిమున్సిపల్‌ చైర్మన్‌, వైస్ చైర్మన్‌ల ఎన్నికల వాయిదాకు మంత్రి వివేక్ కుట్రలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో క్యాతన్‌పల్లి మున్సిపల్ కార్యాలయానికి డీసీసీ అధ్యక్షుడు రఘనాథ్ రెడ్డి చేరుకోవడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. మంత్రి వివేక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ఖాతాలోఇస్నాపూర్ మున్సిపాలిటీ

పఠాన్‌ చెరు పరిధిలోని ఇస్నాపూర్‌లో బీఆర్‌ఎస్‌ పాగా వేసింది. కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమాతో ఉన్న ఆ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇక్కడే ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మోతె సుమలత చైర్ పర్సన్ గా వైఎస్ చైర్ పర్సన్ గా పట్లోళ్ల మాధవి నరేందర్ రెడ్డిలు ఎన్నికయ్యారు. ఇక్కడ నీలం మధు సతీమణి కవితను చైర్మన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన వ్యూహాత్మక ఎత్తుగడలతో మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు.
 
జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా

జనగమ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికను ఆర్డీవో గోపిరామ్ వాయిదా వేశారు. ఉద్రిక్తతలు, ఆందోళనల నేపథ్యంలో  జనగాం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు.

Advertisment
తాజా కథనాలు