/rtv/media/media_files/2026/02/16/congress-won-in-mancherial-corporation-2026-02-16-19-19-41.jpg)
Congress won in Mancherial Corporation
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌ను కాంగ్రెస్ దక్కించుకుంది. మేయర్‌గా ధర్ని మధు, డిప్యూటీ మేయర్‌గా రమ్య ఎన్నికయ్యారు. ఇక ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, MIM, ఇండిపెండెంట్‌ల సపోర్ట్‌తో ఛైర్‌పర్సన్‌గా బండారి అనూష, వైస్ ఛైర్‌పర్సన్‌గా మహ్మద్ రోహిత్‌ను ఎన్నుకున్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీను బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఛైర్మన్‌గా మెంగ్రే ఆకాశ్, వైస్ ఛైర్‌పర్సన్‌గా అహ్మద్ ఎన్నికయ్యారు.
Also Read: టూరిస్ట్ యువతిపై గ్యాంగ్ రేప్.. ముగ్గురికి మరణశిక్ష
మరోవైపు బైంసా మున్సిపాలిటీలో బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, ఇండిపెండెంట్ సభ్యుల సపోర్ట్‌తో స్వతంత్ర అభ్యర్థి తూమెల్ల దత్తాత్రిని ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. వైస్ ఛైర్మన్‌గా ఖతుజా సిద్ధికి ఇద్రిస్ ఎన్నికయ్యారు. ఇక నిర్మల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక్కడ భార్యభర్తలు అప్పాల కావ్య ఛైర్‌పర్సన్, అప్పాల గణేశ్ చక్రవర్తి వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఛైర్‌పర్సన్‌గా దొంత అంజలీదేవి, వైస్‌ఛైర్‌పర్సన్‌గా మోత్కూరి రాజేశ్వరిని ఎన్నుకున్నారు.
Also Read: ఇమ్రాన్ ఖాన్‌కు సీరియస్.. జైలు నుంచి రహస్యంగా ఆస్పత్రికి తరలింపు
Follow Us