TS Cabinet : ఈనెల 4న తెలంగాణ మంత్రివర్గం భేటీ..బడ్జెట్ సమావేశాలపై చర్చ..!!
ఈనెల 4వ తేదీన తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణతోపాటు కాంగ్రెస్ ప్రకటించిన ఆరుగ్యారెంటీల్లోని రెండు పథకాల అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీలోనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీని అధికారికంగా నిర్ణయించే అవకాశం ఉంది.