CM Revanth: 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ : సీఎం రేవంత్ మరో 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అలాగే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించే గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. By B Aravind 02 Feb 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు. వచ్చే 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేసే బాధ్యత తమ మంత్రివర్గం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రేవంత్ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యచించారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ కేస్లాపూర్ చేరుకున్న ఆయన.. ఆదివాసీల ఇలవేల్పు దైవం నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో రేవంత్ ముఖాముఖి నిర్వహించారు. Also Read: వచ్చేది మనమే.. కాంగ్రెస్, బీజేపీలపై హరీష్ రావు చురకలు త్వరలో రూ.500లకే సిలిండర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చారని అన్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 ఉందని.. త్వరలోనే మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. అలాగే విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్న రేవంత్.. త్వరలోనే తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని అన్నారు. యూనిఫామ్‌లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే అప్పగిస్తామని తెలిపారు. మాది ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే.. బీఆర్ఎస్ నేతలకు ఎందుకు కడుపు నొప్పి అంటూ ప్రశ్నలు కురిపించారు. తమ ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు కాకముందే.. ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రతిపక్షాలు ఎగిరిపడుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బీఆర్ఎస్ నేతలు కొందరు నిత్యం తమ ప్రభుత్వాన్ని పడగొడతామని, కూలగొడతామని అంటున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. తమది ప్రజల ప్రభుత్వమని.. తమ ప్రభుత్వాన్ని కొట్టేవాళ్లెవరూ లేరంటూ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ జన్మలో మళ్లీ సీఎం కాదు కదా.. కనీసం మంత్రి కూడా కాలేరని అన్నారు. ఎవరి చేతుల్లో తెలంగాణ ఉంటే.. భద్రంగా ఉంటుందో ప్రజలే ఆలోచించాలంటూ కోరారు. Also Read: ఇంకెప్పుడు రేవంత్.. ఆరు గ్యారంటీలపై కేటీఆర్ ఫైర్ #telugu-news #police-notification #telangana-news #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి