KTR: ఇంకెప్పుడు రేవంత్.. ఆరు గ్యారంటీలపై కేటీఆర్ ఫైర్ ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని కేటీఆర్ అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారెంటీలు అమలు చేసేది లేదని.. ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. By V.J Reddy 02 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLA KTR Congress Six Gurantees: ఘట్కేసర్లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు హాజరైయ్యారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఈ సమావేశంలో కాంగ్రెస్ (Congress), బీజేపీలపై (BJP) విమర్శల దాడికి దిగారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఓటమి మనకో స్పీడ్ బ్రేకర్ అని.. లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అన్నీ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ALSO READ: సీఎం రేవంత్‌కు షాక్.. బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారెంటీలు అమలు చేసేది లేదని చెప్పారు. ఆ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావన్నారు. ఇండియా కూటమిలో ముఖ్యమైన పార్టీలు వెళ్లిపోయాయని తెలిపారు. కృష్ణానది జలాల్లో మన వాటా తేల్చకుండానే కృష్ణా బోర్డుకు మన జలాలను అప్పగించిన కాంగ్రెస్ ప్రభుత్వం - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS pic.twitter.com/GhsfdvFaBJ — BRS Party (@BRSparty) February 2, 2024 ‘కృష్ణా, గోదావరి జీవ నదులు. కృష్ణా నదిలో మన వాటాను కేంద్రం ఇంకా తేల్చలేదు. మన వాటా చెప్పకుండానే ఆ బోర్డుకు మన కృష్ణా జలాలను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారు. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉండాలి. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ ఎంపీలే. మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 420 హామిలిచ్చిన రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆస్తి బీఆర్ఎస్ పార్టీ.. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS pic.twitter.com/stpqWbZve1 — BRS Party (@BRSparty) February 2, 2024 ALSO READ: ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఈరోజు నుంచే? #congress-six-guarantees #mp-elections-2024 #ktr #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి