TS Cabinet : ఈనెల 4న తెలంగాణ మంత్రివర్గం భేటీ..బడ్జెట్ సమావేశాలపై చర్చ..!! ఈనెల 4వ తేదీన తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణతోపాటు కాంగ్రెస్ ప్రకటించిన ఆరుగ్యారెంటీల్లోని రెండు పథకాల అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీలోనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీని అధికారికంగా నిర్ణయించే అవకాశం ఉంది. By Bhoomi 02 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ఈనెల 4వ తేదీన తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణతోపాటు కాంగ్రెస్ ప్రకటించిన ఆరుగ్యారెంటీల్లోని రెండు పథకాల అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీలోనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీని అధికారికంగా నిర్ణయించే అవకాశం ఉంది. ఈనెల 8వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేయనున్నారు. ఇక10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. 11వ తేదీ ఆదివారం సెలవు దినం వదిలేస్తే...12వ తేదీ నుంచి 5రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఇది కూడా చదవండి: శ్రీవారి భక్తులకు అలర్ట్…ఈ తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు..!! అటు ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు. వచ్చే 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేసే బాధ్యత తమ మంత్రివర్గం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రేవంత్ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యచించారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ కేస్లాపూర్ చేరుకున్న ఆయన.. ఆదివాసీల ఇలవేల్పు దైవం నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో రేవంత్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చారని అన్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 ఉందని.. త్వరలోనే మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. అలాగే విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్న రేవంత్.. త్వరలోనే తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని అన్నారు. యూనిఫామ్‌లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే అప్పగిస్తామని తెలిపారు. #cabinet-meeting #ts-budget #telangana #revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి