Bandi Sanjay: రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక...అన్ని మర్చిపోయారు..!! సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండిసంజయ్. ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పుతున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిదని సీఎం అన్నారని గుర్తు చేశారు. By Bhoomi 02 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Bandi Sanjay: తెలంగాణ ప్రజలను నమ్మించి..మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే మాట తప్పుతున్నారని ఫైర్ అయ్యారు. మేనిఫెస్టోలో భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిదని సీఎం అన్నారని గుర్తు చేశారు. ప్రతిహామీని నేరవేరుస్తామని ప్రకటించిన రేవంత్ మాట తప్పారన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ...ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ నియామకాలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని..కానీ ఇప్పటివరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ మాటే ఎత్తడం లేదని విమర్శించారు. మేనిఫెస్టో ఎన్నికల వరకే పవిత్ర గ్రంథమా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత చిత్తు కాగితామా అంటూ ప్రశ్నలు సంధించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ కు లోకసభ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారంటూ బండి సంజయ్ ఆరోపించారు. కాగా అటు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 350కి పైగా ఎంపీ సీట్లు గెలవబోతోందని బండి అన్నారు. ఇది కూడా చదవండి: ట్రక్కు డ్రైవర్లకు పీఎం మోదీ గుడ్ న్యూస్..డ్రైవర్ల కోసం హైవేలపై ప్రత్యేక కేంద్రాలు..!! #revanth-reddy #congress-guarantees #bandi-sanjay మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి