Khammam: సీఎం రేవంత్‌కు షాక్.. బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ కంచుకోట ఖమ్మంలో కొందరు కాంగ్రెస్ నేతలు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ లిస్టులో కాంగ్రెస్ PCC సెక్రెటరీగా ఉన్న అంకిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా ఉన్నారు. త్వరలో బీజేపీలో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారీగా చేరికలు ఉంటాయని కిషన్ రెడ్డి అన్నారు.

New Update
Khammam: సీఎం రేవంత్‌కు షాక్.. బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు

Congress Leaders Joined in BJP: తెలంగాణ పగ్గాలను తమ చేతిలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ (Congress Party).. ఎంపీ ఎన్నికలపై (MP Elections) కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం (Khammam) తమకు కంచుకోట అని అనుకున్న కాంగ్రెస్ పార్టీకి అక్కడి నేతలే షాక్ ఇచ్చారు. ఈ రోజు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆధ్వర్యంలో కాషాయ జెండా కప్పుకొని బీజేపీలో (BJP) చేరారు కొందరు ఖమ్మం కాంగ్రెస్ నేతలు.

అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ PCC సెక్రెటరీ గా ఉన్న అంకిరెడ్డి సుధీర్ రెడ్డి బీజేపీ పార్టీ లో చేరారని అన్నారు. ఫిబ్రవరి మొత్తం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీ లో చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. చేరికలకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కేసిఆర్ కుటుంబం మీద కోపం తోనే కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు ఓటేశారని అన్నారు. కాంగ్రెస్ గెలవలేదు .. బీ‌అర్‌ఎస్ ను ప్రజలు ఓడించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్స్ గెలిచిన సమస్యలు పరిష్కారం కావని అన్నారు.

ALSO READ: ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఈరోజు నుంచే?

కాంగ్రెస్ ది అక్రమాల చరిత్ర..

కేసిఆర్ హయాంలో సిటీ చుట్టూ పక్కల భూముల చేతులు మారాయని ఆరోపించారు కిషన్ రెడ్డి. వాటి మీద సమగ్రమైన విచారణ జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ది అక్రమాల చరిత్ర అని ఫైర్ అయ్యారు. అందుకే ఒక్కటి రెండు రాష్ట్రాలకు పరిమితం అయ్యిందని అన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తే అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా లేదని వ్యాఖ్యానించారు

ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) అవశ్యకత లేదని అన్నారు. గత పదేళ్ళలో అబివృద్దికి బదులు ప్రజల ఆత్మ గౌరవం ను బీఆర్ఎస్ దెబ్బ తీసిందని మండిపడ్డారు. దేశ అబివృద్ధి కోసం బీజేపీ లో చేరాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రజలను సంగటితం చేసి వారి బండారం బయట పెడతాం అని హెచ్చరించారు.

మాకు పొత్తు లేదు..

ఎన్నికల్లో గెలిచేందుకు తాము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు కిషన్ రెడ్డి. తాము రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీ మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది అని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) బీజేపీ తెలంగాణలో 16 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ: ఏపీకి ప్రత్యేక హోదా.. ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష

DO WATCH: 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు