/rtv/media/media_files/2025/05/15/Vm7Cdcz93ef9rGuyyjS8.jpg)
Women fight for seats in Telangana RTC bus
తెలంగాణలో మహిళల కోసం ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలు ఫ్రీగా బస్సుల్లో ప్రయాణించే సౌకర్యాన్ని ప్రభుత్వం అందించింది. దీంతో చాలా మంది మహిళలు హ్యాపీగా బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మహిళలు బస్సుల్లో సీట్ల కోసం పొట్టు పొట్టున కొట్టుకుంటున్నారు.
Also Read: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్‌నాథ్ సింగ్
సీటు కోసం సిగపట్లు
ఇప్పటికి చాలానే వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. సీట్ల కోసం లేడీస్ జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు బాదుకున్నట్లు ఉన్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు రచ్చ రచ్చ చేశారు.
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు
— Telugu Scribe (@TeluguScribe) May 15, 2025
నీ అంతు చూస్తా బిడ్డా అంటూ..
మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న ఇద్దరు మహిళలు pic.twitter.com/qa6c2v9UJK
Also Read : హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!
జుట్లు పట్టుకుని రప్పా రప్పా బాదుకున్నారు. పక్కన ఉన్న తోటి ప్రయాణికులు ఆపుతున్నా ఆగలేదు. నీ అంతుచూస్తా బిడ్డా అంటూ సవాళ్లు విసురుకున్నారు. ఒక పెద్దావిడకు, మరో మహిళకు మధ్య సీటు కోసం వివాదం జరిగింది. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఈ ఇద్దరు మహిళలు బాదుకోవడం సంచలనంగా మారింది. బస్సును తిన్నగా పోలీస్ స్టేషన్‌కు వద్ద ఆపమని.. అక్కడే స్టేషన్ వద్ద తేల్చుకుందామని వారు ఘర్షణ పడ్డారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read: అబ్బాయిలంటే అలెర్జీ.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. వైరల్ వీడియో!
women-fight | two women fighting | latest-telugu-news | telugu-news | Viral Video
Also Read : రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి 3 నెలల రేషన్!
Follow Us