Khammam: ఖమ్మం ఆస్పత్రిలో కలకలం.. వృద్ధురాలి ప్రాణాలు తీసిన లిఫ్ట్!

ఖమ్మం జిల్లాకి చెందిన సరోజనమ్మకి ఛాతీ నొప్పి రావడంతో ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌ లో స్టంట్‌ వేయించుకుంది.ఆపరేషన్‌ గది నుంచి రూమ్‌ కి లిఫ్ట్‌ లో తరలిస్తున్న సమయంలో లిఫ్ట్‌ పాడైపోవడంతో ఒక్కసారిగా కిందపడిపోయింది.దీంతో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో చనిపోయింది.

New Update
lift

lift

అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్న పన్ను విరిగిందని..ఛాతిలో నొప్పి వచ్చి ఆసుపత్రికి వెళ్తే..అక్కడ స్టంట్‌ వేసి ఆపరేషన్‌ చేశారు.అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో మృత్యువు ఆమెను లిఫ్ట్‌ రూపంలో వెంటాడింది. ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి మామూలు గదికి తీసుకుని వచ్చే క్రమంలో లిఫ్ట్‌ ఎక్కగా..అది కాస్త ఫెయిల్‌ అయ్యి కిందకి పడిపోయింది. దీంతో ఆపరేషన్‌ చేయించుకున్న మహిళ మృతి చెందింది. ఈ విషాధ ఘటన ఖమ్మంలో జరిగింది. 

Also Read:  India-Canada-Trudeau: ట్రూడో హయంలో తీవ్రవాదులకు లైసెన్స్‌లు!

బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం గ్రామానికి చెందిన సరోజనమ్మకు ఈ నెల 20న ఛాతీలో నొప్పి రావడంతో నగర కేంద్రం నెహ్రూ నగర్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. డాక్టర్లు పరీక్షించి గుండె సమస్య ఉందని చెప్పడంతో అక్కడే జాయిన్‌ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆమె గుండెకు స్టెంటు వేసి ఎలాంటి ప్రాణాపాయం లేదని కుటుంబ సభ్యులకు చెప్పారు.

Also Read: Telangana Rains:తెలంగాణలో భారీ వర్షాలు.. మరో రెండు రోజులూ ఇదే పరిస్థితి..!

అనంతరం రెండో అంతస్తులో ఉన్న ఆపరేషన్​ థియేటర్​ నుంచి నాలుగో అంతస్తులోని ఐసీయూకు తరలించేందుకు సిద్ధమయ్యారు. సరోజనమ్మను స్ట్రెచర్​పై ఇద్దరు సిబ్బంది తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో లిఫ్టు ఎక్కిస్తుండగా స్ట్రెచర్​ సగం వరకు లోపలికి వెళ్లింది. ఆ తర్వాత లిఫ్టు క్యాబిన్​ ఒక్కసారిగా పైకి వెళ్లింది. లిఫ్టులోనే మహిళ, సిబ్బంది ఉండిపోయారు. పైకి వెళ్లిన లిఫ్టు తిరిగి కిందకు ఒక్కసారిగా పడిపోయింది. అక్కడే ఉన్న సహాయక సిబ్బంది వెంటనే లోపల ఇరుక్కున్న ఇద్దరినీ డోర్​ తొలగించి బయటకు తీసుకొచ్చారు. 

ఈ ప్రమాదంలో సరోజనమ్మకు గాయాలు కాగా చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. ఆసుపత్రి సిబ్బంది ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదని సీఐ  తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. ఈ విధంగా ఆమె చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Also Read: Breaking News: రోడ్డు ప్రమాదంలో అడిషనల్‌ డీసీపీ స్పాట్‌ డెడ్‌!

Also Read: Ap Weather: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో నాలుగు రోజులు వానలే..వానలు!

khammam | crime | hospital | lift | accident | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు