/rtv/media/media_files/2025/05/17/SZQrA7n3aj9fwxXc5fxK.jpg)
KTR visits Harish Rao's house
మాజీ మంత్రి హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు చేసిన నేపధ్యంలో కేటీఆర్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు ఉన్నారని కవిత కొన్ని గంటల ముందు కవిత ఆరోపించారు. కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటించింది హరీశ్ రావు, సంతోష్ రావులే అని అన్నారు. ఈ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండిస్తూ కేటీఆర్ హరీష్ రావుకు కేటీఆర్ మద్దతుగా నిలిచారు.
This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏
— KTR (@KTRBRS) September 1, 2025
I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu https://t.co/w5YGJCETtL
కవిత ఆరోపణల నేపథ్యంలో హరీష్‌కు సపోర్టుగా కేటీఆర్ ట్వీట్ చేశారు. అసెంబ్లీలో హరీష్ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ 'మాస్టర్ క్లాస్' అని పొగిడేశారు. 'కేసీఆర్ సమర్థుడివైన శిష్యుడు అసెంబ్లీలో చెప్పిన ఇరిగేషన్ పాఠాలు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అయిష్టంగానే నేర్చుకున్నారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కవిత హరీశ్ రావుపై ఆరోపణలు చేసిన తర్వాత బీఆర్ఎస్ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో హరీశ్ రావు ఫైర్ అంటూ వీడియో పోస్ట్ చేసింది. అదే వీడియోను కేటీఆర్ రీ పోస్ట్ చేస్తూ పొగడ్తలతో ముంచెత్తారు. పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ కవిత వ్యాఖ్యలు ఖండిస్తూ హరీశ్ రావు అండగా ఉంటున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు ఎవరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేేదు. అటు హరీశ్ రావు వ్యక్తిగత పనులపై లండన్ పర్యటనలో ఉన్నారు.
కవిత కామెంట్స్..
కేసీఆర్‌పై అవినీతి మరకలు రావడానికి హరీశ్ రావు, సంతోష్ రావులే కారణమని అన్నారు. కాళేేశ్వరం ప్రాజెక్ట్‌లో వారి స్వార్ధం వాడుకున్నారని కవిత అన్నారు. బీఆర్ఎస్ కొందరు చేసిన తప్పుల వల్లనే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను ప్రశ్నిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హరీశ్ రావు అక్రమాలకు పాల్పడ్డారని తెలిసే ఇరిగేషన్ శాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పించారని కవిత చెప్పుకొచ్చారు.
కాళేశ్వరంపై విచారణ సాకుతో ప్రధాని మోదీతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సీబీఐ విచారణ పేరుతో కేవలం కేసీఆర్, భారత రాష్ట్ర సమితిపైనే దాడి జరగడం లేదన్న ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించే కుతంత్రాలకు తెరదీశారని విమర్శించారు. పార్టీ శ్రేణులతో ఆయన సోమవారం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.