SLBC Tunnel Rescue Operation: టన్నెల్ లోకి వెళ్లిన క్యాడవర్​ డాగ్స్​ ఏం చేశాయంటే..

ఎస్​ఎల్​బీసీ టన్నెల్​లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. టన్నెల్‌లో లోపల చిక్కుకుపోయిన వారి ఆనవాళ్లు గుర్తించేందుకు కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ రంగంలో దిగాయి. ఈ ఉదయమే డాగ్స్ టీం టన్నెల్ లోకి వెళ్ళింది. టన్నెల్ లో మూడు ప్రాంతాలను డ్యాగ్స్ గుర్తించాయి.

New Update
 SLBC tunnel accident:

SLBC tunnel accident:

ఎస్​ఎల్​బీసీ టన్నెల్​ (SLBC Tunnel) లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టి నేటితో 14 రోజులు అవుతుంది.  టన్నెల్‌లో లోపల చిక్కుకుపోయిన వారి ఆనవాళ్లు గుర్తించేందుకు కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ రంగంలో దిగాయి. ఈ ఉదయమే డాగ్స్ టీం టన్నెల్ లోకి వెళ్ళింది. టన్నెల్ లో మూడు ప్రాంతాలను డ్యాగ్స్ గుర్తించాయి. ఆ ప్రాంతంలో సిబ్బంది తవ్వకాలు ప్రారంభించారు. బెల్జియం మ్యాల్నోయిస్ బ్రీడ్‌కు చెందిన క్యాడవర్ డాగ్స్..15 అడుగుల లోపల ఉన్న మృతదేహాలను కూడా గుర్తించగలవు.

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!

SLBC Tunnel Rescue Operation

డ్యాగ్స్ తో  పాటు 110 మంది రెస్క్యూ బృందంతో లోకో మోటర్ కూడా టన్నెల్ లోకి వెళ్ళింది. ఆపరేషన్‌కు అవసరమైన సామాగ్రిని లోకో ట్రైన్ లోపలికి తీసుకువెళ్లింది. ఈ మొత్తం రెస్క్యూ ఆపరే‌షన్‌ను డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా, NDRF అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ హర్షిత్ పరిశీలిస్తున్నారు.ఇదిలా ఉంటే.. మరోసారి టన్నెల్‌లోకి రోబోటిక్‌ టీమ్‌ వెళ్లింది. ఈ బృందం వెంట మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్‌ కూడా వెళ్లారు. టన్నెల్‌లోని పరిస్థితులను అంచనా వేస్తున్నారు. రోబోలను తెప్పించి సహాయక చర్యలకు ఉన్న అనువైన పరిస్థితులనపై పరిశీలిస్తున్నారు. ఇప్పటికే క్యాడవర్ డాగ్స్‌ టన్నెల్‌ లోపలికి వెళ్లాయి. చిక్కుకున్న వారి కోసం క్యాడవర్ డాగ్స్‌తో తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టన్నెల్‌లో కార్మికుల జాడ గుర్తించేందుకు జీపీఆర్‌ సహాయంతో సిగ్నళ్లు పంపగా.. 8 ప్రదేశాల నుంచి బలమైన సిగ్నల్స్‌ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాలను, లోతును లెక్కకడుతున్నారు. ఎనిమిది ప్రాంతాల్లో మార్కింగ్‌ చేసి రెండుచోట్ల తవ్వకాలు జరిపితే యంత్ర పరికరాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతాలను వదిలేసి మిగతా ఆరు చోట్ల తవ్వకాలు చేపట్టారు.

Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

Also Read :  ఈ పండు తొక్కలతో.. వేసవిలో అందం మీ సొంతం

మరోవైపు.. టన్నెల్‌లోని వ్యర్దాలను కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా బయటికి పంపుతున్నారు. ఈ బెల్ట్ ద్వారా గంటకు 8 వందల టన్నుల వ్యర్దాలను బయటికి పంపుతున్నారు. దీంతో టన్నెల్‌లో భారీగా పేరుకుపోయిన మట్టి, బురదను త్వరిత గతిన తొలగించే అవకాశం ఏర్పడింది. వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు. టన్నెల్ లోకి వెళ్లిన క్యాడవర్​ డాగ్స్​ మూడు అనుమానిత ప్రాంతాలను గుర్తించాయి. దీంతో ఆ ప్రాంతంలో మృతదేహలు ఉంటాయన్న అనుమానంతో మూడు చోట్ల తవ్వకాలు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మట్టి పేరుకు పోయి ఉండడంతో ఆ మట్టిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Also Read :  సీఎం కేసీఆర్.. రేవంత్ పేరు మళ్లీ మర్చిపోయిన మంత్రి పొన్నం, ఎమ్మెల్యే రాందాస్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు