Summer: ఈ పండు తొక్కలతో.. వేసవిలో అందం మీ సొంతం

నిమ్మ తొక్కలను నమలడం లేదా చర్మానికి అప్లై చేయడం వల్ల కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇందులోని పోషకాలు జీర్ణ సమస్యలు, గుండె పోటు వంటివి రాకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ తొక్కల పొడిని అయినా ఉపయోగించవచ్చు.

New Update
Moringa Leaves skin

skin

ఆరోగ్యానికి నిమ్మ ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వేసవిలో నిమ్మకాయను తీసుకోవడం వల్ల తక్షణమే శక్తి లభిస్తుంది. ఉదయాన్నే నిమ్మకాయ నీటిని చాలా మంది తాగుతుంటారు. ఇందులోని విటమిన్లు, ఫైబర్ నీరసం, అలసట వంటి సమస్యలు రాకుండా చేస్తాయి. అయితే చాలామంది నిమ్మకాయలు యూజ్ చేసి, తొక్కలను పడేస్తుంటారు. వీటివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని భావిస్తారు. కానీ నిమ్మ తొక్కలతో వేసవిలో సౌందర్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!

కడుపు సంబంధిత సమస్యలు..

నిమ్మ తొక్కల్లో  విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ట్యాన్, మొటిమలు, మచ్చలు అన్నింటిని కూడా తొలగిస్తాయి. నిమ్మ తొక్కలను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. నిమ్మ తొక్కలను నమలడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గడం, కడుపు సంబంధిత సమస్యల నుంచి విముక్తి చెందుతారని నిపుణులు చెబుతున్నారు. నిమ్మ తొక్కలు నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తాయి. ఇందులోని సిట్రస్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాను అంతం చేస్తాయి. దీంతో దుర్వాసన తగ్గుతుంది. 

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!

నిమ్మ తొక్కలో ఎక్కువ మొత్తంలో ఫైబర్, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు రక్తపోటును నియంత్రిస్తాయి. అలాగే గుండె ప్రమాదాలు రాకుండా కాపాడుతుంది. నిమ్మతొక్కలో ఉండే ఫైటోకెమికల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి. నిమ్మ తొక్కను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అయితే ఈ నిమ్మ తొక్కను కేవలం నమలడమే కాకుండా పొడి కూడా చేసుకోవచ్చు. 

ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్‌ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు