పబ్జీలో పరిచయం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో రూ.8లక్షలు నష్టం, చివరికి..!

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు వరంగల్ యువకుడు బలయ్యాడు. పబ్జీలో పరిచయమైన ఓ యువకుడి మాటలు విని అనూక్ (25) అప్పు తీసుకుని బెట్టింగ్ ఆడాడు. అలా దాదాపు రూ.8 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. అప్పు ఎలా తీర్చాలో తెలీక మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
sucide

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు యువకులు బలవుతున్నారు. చిటికెలో కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో అత్యాశకు పోతున్నారు. లక్షల్లో అప్పు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తమను పెంచిన తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, పిల్లల జీవితాల గురించి ఆలోచించడం లేదు. ‘పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు’ అనే సామెతను కొట్టిపారేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా

ఇలా బెట్టింగ్ కోసం లక్షలు అప్పు తీసుకుని నష్టపోతున్నారు. ఆపై అప్పు తీర్చలేక మనస్థాపంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా చేస్తున్న వారిలో ఎక్కువ మంది యువకులే ఉంటడం విశేషం. అయతే రిస్క్ చేయడం మంచిదే కానీ.. అప్పు చేసి బెట్టింగ్‌ ఆడటం మంచిది కాదని చాలా మంది చెప్తున్నారు. సొంతంగా సంపాదించి.. ఒక మంచి బిజినెస్ పెట్టుకుని రిస్క్ చేయాలి తప్పా.. అప్పులు చేసి ఇలాంటి జూదం ఆడకూడదని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: ట్రూడోకు షాక్.. ఉప ప్రధాని రాజీనామా

ఇదిలా ఉంటే ఇప్పటికి చాలా మంది యువకులు లక్షల్లో అప్పు చేసి ఆన్‌లైన్ బెట్టింగ్‌ ఆడి నష్టపోయి ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలి అయ్యాడు. పురుగుల మందు తాగి 25 ఏళ్ల యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండఅవుతాపురంలో చోటుచేసుకుంది. 

ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి

బండఅవుతాపురానికి చెందిన 25 ఏళ్ల అనూక్ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. అతడు తరచూ పబ్జీ గేమ్ ఆడుతుండేవాడు. అయితే ఒక రోజు విజయవాడకు చెందిన ఓ యువకుడు అనూక్‌కి పబ్జీగేమ్‌లో పరిచయం అయ్యాడు. అనంతరం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని విజయవాడకు చెందిన యువకుడు అనూక్‌ని నమ్మించాడు. దీంతో అతడి మాటలు నమ్మిన అనూక్ దాదాపు రూ.5 లక్షల వరకు అవతలి వ్యక్తికి పంపించాడు. 

ఇలా అనూక్ సుమారు రెండు సంవత్సరాలుగా ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటయ్యాడు. ఇక పెట్రోల్ బంక్‌లో పని చేయగా వస్తున్న జీతంతో పాటు.. అధిక వడ్డీలకు అప్పు తీసుకుని ఆన్‌లైన్‌ గేమ్స్‌ బెట్టింగ్ పెట్టేవాడు. అలా దాదాపు రూ.8 లక్షల వరకు డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక ఎంతో మదనపడి చివరికి చావే సరైన దారి అని నిర్ణయించుకున్నాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అనూక్ మృతితో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు