Cricket: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా

టెస్ట్ బ్యాటింగ్‌లలో నా రికార్డ్ లు ఏంటో తెలియాలంటే గూగుల్‌లో వెతుక్కోండి అంటూ సంచలన కామెంట్స్ చేశాడు భారత బౌలర్ బుమ్రా. తనను చులక చేయాలనుకున్న మీడియా పర్శన్‌కు తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. 

New Update
00

భారత బౌలర్లలో బుమ్రా స్ధానం అందరికీ తెలిసిందే. బౌలర్‌‌గా బుమ్రా రికార్డ్‌లు ఎన్ని ఉన్నాయో కూడా తెలిసిందే. అయితే ఏ టీమ్‌లో అయినా బౌలర్ కూడా బ్యాటింగ్ చేయాల్సిందే. ఆఖరి స్థానంలో క్రీజులోకి వచ్సినా ఎంతో కొంత బ్యాటింగ్ చేయడం తెలిసుండాలి. ఈ విషయంలో బుమ్రా సూపర్.  మిగతా బౌలర్ల కంటే బుమ్రా బ్యాటింగ్ చాలా బాగా చేస్తాడు. ఇతనికి కొన్ని రికార్డ్‌లు కూడా ఉన్నాయి.  జట్టుకు తన వంతు పరుగులు చేయడంలో సహాయపడగల సమర్థుడు. అయితే రీసెంట్‌గా ఓ మీడియా పర్శన్ బుమ్రా మీద సెటైర్లు వేయడానికి ప్రయత్నించాడు. తన్ని చులకన చేసేలా మాట్లాడారు. దానికి భారత పేసర్ తనదైన శైలిలో కౌంటర్లు విసిరారు.

గూగుల్‌లో చూసుకోండి..

హాయ్ బుమ్రా.. బ్యాటింగ్‌పై మీ అంచనా ఏమిటి..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్ప గల సరైన వ్యక్తి మీరు కానప్పటికీ, గబ్బాలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే జట్టు పరిస్థితి గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటూ రిపోర్టర్ అడిగాడు. దీనికి బుమ్రా రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ మీరు నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న వేయడానికి ముందు మీరు గూగుల్‌ని ఉపయోగించాల్సింది. ఒక టెస్ట్ ఓవర్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ ఎవరనేది చెక్ చేయాల్సింది. అని భారత పేసర్ బదులిచ్చారు. బుమ్రా ఇలా సమాధానం చెప్పేసరికి రిపోర్టర్ ఖంగుతిన్నాడు. బుమ్రా నోటి నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని ఆశించని మీడియా మిత్రులు నవ్వుతో తమ తప్పును సరిదిద్దుకున్నారు.

Also Read: Syria: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు