సిరియాను తిరుగుబాటు దళాలు అక్రమించుకున్నాయి. డమాస్కస్‌లో పాగా వేశాయి. దీంతో ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆయన రష్యాలో ఉన్నారు. ఇలా దేశం విడిచి వెళ్ళాక అసద్ మొదటిసారి స్పందించారు. డమాస్కస్‌ను తిరుగుబాటు దళాలు ఆక్రమించుకున్న క్రమంలో తాను దేశాన్ని వీడి వెళ్లిపోవాలని అనుకోలేదని సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అసద్ చెప్పారు. రష్యా బేస్ నుంచే పోరాటం చేయాలనుకున్నానని చెప్పారు. డమాస్కస్‌లో తన ఇంటి మీద, సైనిక స్థాంపై డ్రోన్‌ల దాడులు జరగడం వల్లనే రష్యా సైన్యం తనను సురక్షిత ప్రాంతాలకు తరలించిందని చెప్పారు.
ఫేస్‌బుక్‌లో పోస్ట్..
దీని గురించి అసద్ తన ఫేస్‌బుక్‌లో మొదటిసారిగా స్పందించారు. తిరుగుబాటు దళాలు డమాస్కస్‌ను ఆక్రమించుకున్న కొన్ని గంటలకే.. డిసెంబర్ 8న ఉదయం నగరాన్ని విడిచిపెట్టాను. రష్యా సహకారంతో లటాకియాలో ఉన్న వారి సైనిక స్థావరానికి చేరుకున్నా. అక్కడ నుంచే పోరాటం చేయాలనుకున్నా. అయితే ఈ సైనిక స్థావరంపైన కూడా డ్రోన్లతో దాడులు జరిగాయి. దాంతో అదే రోజు రాత్రి నన్ను రష్యాకు తరలించాలని పుతిన్ సైన్యం నిర్ణయించింది అని అసద్ చెప్పారు.
Also Read: TS: భూమి లేని వారికి రూ. 6 వేలు..తెలంగాణ కేబినెట్ నిర్ణయం