Canada: ట్రూడోకు షాక్.. ఉప ప్రధాని రాజీనామా

కెనడా ప్రధాని ట్రుడోకు బిగ్ షాక్ తగిలింది. కెనడా ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వెళ్ళిపోతూ ట్రూడో మీద విపరీతమైన విమర్శలు గుప్పించారు. 

New Update
00

కెనడా రాజకీయాల్లో పెద్ద కుదుపు వచ్చింది.  కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఆ దేశ డిప్యూటీ పీఎం, ఆర్థికశాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్‌ తన పదవికి రాజీనామా చేశారు. జస్టిన్‌ ట్రూడో  కేబినెట్‌లో అత్యంత శక్తిమంతురాలిగా గుర్తింపు పొందిన ఈమె రాజీనామా చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయితే తాను రిజైన్ చేయడానికి కారణం..  ప్రధాని ట్రూడో ప్రజాదరణ కోల్పోవడమే అని చెప్పారు.  కానీ అంతకు ముందే ఫ్రీలాండ్ ఆమె నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను మారుస్తున్నట్లు ట్రూడో ప్రకటించారు. అందుకే క్రిస్టియా.. తన పదవికి రాజీనామా చేయడమే సరైన మార్గమని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇలా అయితే కష్టమే..

కెనడా ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ 25శాతం టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇవి చాలా తీవ్ర పరిణామాలు అని క్రిస్టియనా ఫ్రీలాండ్ అంటున్నారు. ఈ విక్ష్మీఆలనే ఆమె తన రాజీనామాలో రాసింది కూడా. గత కొన్ని వారాలుగా ఉత్తమ మార్గాల కోసం అన్వేషించామని, ఈ క్రమంలో తన మధ్యా, ట్రూడో మధ్యనా భిన్నాభిప్రాయాలు  వచ్చాయని ఫ్రీలాండ్ తెలిపారు. అయితే తాను లిబరల్‌ పార్టీ సభ్యురాలిగానే కొనసాగుతానని చెప్పారు క్రిస్టీనా. వచ్చే ఎన్నికల్లో టొరంటో నుంచి మళ్లీ పోటీ చేస్తానన్నారు. 2013లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన క్రిస్టియా.. తర్వాత ట్రూడో కేబినెట్‌లో చేరారు. వాణిజ్యం, విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 2020 నుంచి ఆర్థికమంత్రిగా కొనసాగారు ఫ్రీలాండ్. 

Also Read: Cricket: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు