KCR: కేసీఆర్కు దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉంది.. బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

కేంద్రమంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ చీఫ్ కేసీఆర్ కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉందంటూ ఆరోపణలు గుప్పించారు.  దొంగనోట్లు వ్యాపారం చేసి ఎన్నికల్లో దొంగనోట్లు పంచారని సంజయ్‌ సంచలన కామెంట్స్ చేశారు.

New Update
Bandi Sanjay Comments on Delhi Election Results

Bandi Sanjay Comments on Delhi Election Results

కేంద్రమంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ చీఫ్ కేసీఆర్ కు బీదర్‌లో దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉందంటూ ఆరోపణలు గుప్పించారు.  దొంగనోట్లు వ్యాపారం చేసి ఎన్నికల్లో దొంగనోట్లు పంచారని సంజయ్‌ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని సంజయ్ ఆరోపించారు. దీనికి కేసీఆర్ మూర్ఖత్వమే కారణమని విమర్శించారు. తెలంగాణకు ఆరు కోట్ల అప్పు ఉందని సీఎం రేవంత్ చెబుతున్నారని..  హామీలు ఇచ్చినప్పుడు అప్పులు గుర్తుకులేవా అని సీఎం రేవంత్ ను నిలదీశారు.  అధికారంలోకి వచ్చాక ఏం చేద్దామని అనుకున్నారని సంజయ్ ప్రశ్నించారు.  అప్పులు తీర్చేందుకు ప్రభుత్వం భూములు అమ్మేందుకు సిద్ధమైందని సంజయ్ ఆరోపించారు.   

Also read : బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇదే!

Also read :  తల్లి డైరెక్షన్‌..కొడుకులు యాక్షన్‌.. షేక్​ పేట చోరీ కేసులో బిగ్‌ట్విస్ట్‌

అధ్యక్ష పదవి ఇస్తే తీసుకుంటా

అంతకుముందు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తాను బీజేపీ అధ్యక్ష రేసులో లేనన్నారు. ఇస్తే వద్దనని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నానని తెలిపారు.  కొంత మంది వ్యక్తులు అధ్యక్షులం  అవుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారని..  ఇలా ప్రచారం చేసుకోవడం పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకమని సంజయ్ చెప్పుకొచ్చారు. అలా ప్రచారం చేసుకుని  కార్యకర్తలను కన్య్ఫూజ్ చేయవద్దన్నారు.  పార్టీ పెద్దలు అధ్యక్షుడ్ని నిర్ణయిస్తారని..తాను కేంద్ర సహాయమంత్రిగా ఉన్నానని బండి సంజయ్ తెలిపారు.  అధ్యక్ష పదవిపై కేంద్ర నాయకత్వం చాలా సీరియస్‌‌గా ఉందని అన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అంతా కట్టుబడి ఉండాలని నాయకులు, కార్యకర్తలకు సంజయ్ పిలునిచ్చారు.

Also read :  డ్రెస్ మార్చుకుంటుంటే డోర్ తీశాడు.. ఆ డైరెక్టర్ పై షాలిని కామెంట్స్

Also read :  గువాహటి ఐఐటీ పరిశోధకుల అద్బుతం.. అంతర్జాతీయ సరిహద్దులపై రోబోల నిఘా !

 

hyderabad | kcr | latest telangana news | telangana news today | telangana-news-updates | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు