IIT Guwahati: గువాహటి ఐఐటీ పరిశోధకుల అద్బుతం.. అంతర్జాతీయ సరిహద్దులపై రోబోల నిఘా !

అంతర్జాతీయ సరిహద్దుల వద్ద నిఘా కోసం అస్సాంలోని గువాహటి ఐఐటీ పరిశోధకులు అధునాతన రోబోలు అభివృద్ధి చేశారు. ఇండియన్ ఆర్మీ ఇప్పటికే ఈ నిఘా వ్యవస్థ కోసం ఫీల్డ్ ట్రయల్స్ కూడా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

author-image
By B Aravind
New Update
IIT Guwahati-incubated start up develops robots for AI-driven surveillance at international borders

IIT Guwahati-incubated start up develops robots for AI-driven surveillance at international borders

అంతర్జాతీయ సరిహద్దుల వద్ద భద్రత కోసం మరో ముందడుగు పడింది. అస్సాంలోని గువాహటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు అధునాతన రోబోలు అభివృద్ధి చేశారు. అంతర్జాతీయ సరిహద్దుల వద్ద నిరంతరం పర్యవేక్షించేందుకు ఏఐ ఆధారిత నిఘాతో ఎంతో ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  ఐఐటీ గువాహటిలో డీఏ స్పాటియో రోబోటిక్ లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్‌ సంస్థ ఈ రోబోలను అభివృద్ధి చేసింది. ఇండియన్ ఆర్మీ ఇప్పటికే ఈ నిఘా వ్యవస్థ కోసం ఫీల్డ్ ట్రయల్స్ కూడా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  

Also Read: ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడ ఏదో తెలుసా..?

Robots For AI Driven Surveillance

దీనిపై డీఎస్‌ఆర్ఎల్‌ సీఈవో అర్నబ్ కుమార్ బర్మాన్ మాట్లాడారు. '' మాన్యువల్‌ పెట్రోలింగ్‌కు భిన్నంగా ఈ రోబోలు స్వయంప్రతిపత్తి వ్యవస్థను కలిగి ఉంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. నావిగేషన్, ఏఐ ఆధారిత నిఘాతో కూడిన ఈ వ్యవస్థ సరిహద్దు రక్షణ, మౌలిక సదుపాయాల నిఘా, వ్యూహాత్మక రక్షణలో ఓ విప్లవాత్మక మార్పునకు నాంది పలకనుంది. జాతీయ, అంతర్జాతీయ భద్రత విషయంలో ఎదురవుతున్న సవాళ్లు ఎదుర్కొనేందుకు ఏఐ ఆధారిత అత్యాధునిక నిఘా పరికరాలు అభివృద్ధి చేయాలనేదే మా లక్ష్యమని'' పేర్కొన్నారు.  

Also Read: ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్న కెనడా.. ఆ పార్టీ వైపే ఓటర్లు

అంతేకాదు ఒకవేళ ముష్కరులు అంతర్జాతీయ సరిహద్దుల్లో డ్రోన్‌ పంపినా లేదా చొరబాట్లకు యత్నించడం చేస్తే ఈ రోబోల సెన్సార్లు వెంటనే యాక్టివేట్ అయ్యి అప్రమత్తం చేస్తాయని తెలిపారు. అలాగే రక్షణ పరంగా జాతీయ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు మరిన్ని ఆవిష్కరణలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 

Also Read: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..పదేళ్ళల్లో జీడీపీ డబుల్

Also Read: 9 ఏళ్ల పిల్లాడిని వదిలి ప్రియుడితో తల్లి జంప్.. ఆ తర్వాత ఏమైందంటే?

 

indian-army | defense | national news in Telugu | today-news-in-telugu | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు