Shalini Pandey: డ్రెస్ మార్చుకుంటుంటే డోర్ తీశాడు.. ఆ డైరెక్టర్ పై షాలిని కామెంట్స్

నటి షాలిని పాండే ఓ ఇంటర్వ్యూలో కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైనా చేదు అనుభవాలను పంచుకుంది.  ఓ సందర్భంలో తాను కారవాన్‌లో డ్రెస్ మార్చుకుంటుండగా..ఓ డైరెక్టర్ అనుమతి లేకుండా డోర్ తీశాడని. దాంతో ఆమె అతడిపై గట్టిగా అరిచేసినట్లు తెలిపింది.

New Update
shalini pandey comments over director

shalini pandey comments over director

Shalini Pandey: నటి షాలిని పాండే  'అర్జున్ రెడ్డి' సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.  ఈ సినిమా తర్వాత షాలిని పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. ఒక్క మూవీ కూడా పెద్ద విజయం సాధించలేకపోయింది. అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ అందుకోలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలో తన కెరీర్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైనా చేదు అనుభవాలను పంచుకుంది. 

Also Read: లారెన్స్ మామూలోడు కాదుగా.. ఈ సారి ఏ దెయ్యానికి బాడీ అద్దెకు ఇస్తున్నాడంటే..?

డ్రెస్ మార్చుకుంటుంటే.. 

తాను నటించిన లేటెస్ట్ సీరీస్ 'డబ్బా కర్టెల్' ప్రమోషన్స్ లో భాగంగా షాలిని మాట్లాడుతూ..  ''కెరీర్ ప్రారంభంలో నేను ఓ సౌత్ సినిమా చేశాను. ఆ సమయంలో డైరెక్టర్ ప్రవర్తన కారణంగా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఓ సందర్భంలో నేను కారవాన్‌లో డ్రెస్ మార్చుకుంటుండగా.. అనుమతి లేకుండా డోర్ తీశాడు. అప్పుడు నాకు కోపం వచ్చి ఆ డైరెక్టర్ పై  అరిచేశాను. దాంతో అక్కడి నుంచి అతడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చుట్టుపక్కన ఉన్నవాళ్లు అలా కోప్పడకూడదని అన్నారు. కానీ నాకు మాత్రం నేను చేసిందే కరెక్ట్ అనిపించింది. ఆ తర్వాత అలాంటి సంఘటన మళ్ళీ నాకు ఎదురుకాలేదు'' అంటూ తన అనుభవాన్ని పంచుకుంది. 

telugu-news | latest-news | cinema-news

Also Read: Hit 3 Song: రొమాంటిక్‌గా మారిన నాని.. హిట్ 3 'ప్రేమ వెల్లువ' లవ్ సాంగ్ ప్రోమో రిలీజ్ ..

Advertisment
Advertisment
తాజా కథనాలు