/rtv/media/media_files/2025/02/11/aKwmxhrOZsEEB6JLPuES.jpg)
Donald Trump
అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వృథా వ్యయం కట్టడి కోసం రూపొందించిన డోజ్ విభాగం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. భారత్ లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్ ను ఇటీవల ఈ విభాగం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయాన్ని తాజాగా అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సమర్థించడం చర్చనీయాంశమైంది. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎందుకు ఇవ్వాలంటూ ఆయన ప్రశ్నించారు. ఫ్లోరిడాలోని తన నివాసంలో ట్రంప్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిధుల రద్దు గురించి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ..భారత్ కు మేం ఎందుకు 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలి.
వారివద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో అది ఒకటి.వారు విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ.ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్ ను చేరుకోలేదు.నాకు భారత ప్రజలు, ఆ దేశ ప్రధాని పట్ల చాలా గౌరవం ఉంది. కానీ వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఇవ్వాలి అసలు? మరి మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది..? అంటూ ట్రంప్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఫిబ్రవరి 16న జాబితా ప్రకటించింది. అందులో భారత్ లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్, నేపాల్ కు కేటాయించిన ఫండ్ ను కూడా క్యాన్సిల్ చేశారు.
రాజకీయ వివాదానికి...
అయితే, డోజ్ నిర్ణయం..భారత్ లో రాజకీయ వివాదానికి దారి తీసింది. ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లా? ఇది భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందని ట్రంప్ చెప్పారు. ఈ నిధులతో ఎవరు లాభపడ్డారు? కచ్చితంగా అధికార పార్టీ మాత్రం కాదు అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ పోస్ట్ చేశారు.
భారతీయ వ్యవస్థలో విదేశీ సంస్థలు వ్యవస్థీకృతంగా చొరబాటుకు యత్నిస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విదేశీ బంధాలు బయటపడుతున్నాయంటూ దుయ్యబట్టారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చారు.
Also Read:IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే నో రిఫండ్.. ఐటీ శాఖ ఏమందంటే!
Also Read: Nara lokesh: ఏపీలో టీచర్లకు తీపికబురు చెప్పిన మంత్రి లోకేష్