Suicide : ఇద్దరు టెక్కీల ఆత్మహత్య..సాగర్‌లో దూకి ఒకరు..రైలుపట్టాలపై మరొకరు

నగరంలో ఇద్దరు టెక్కీలు చనిపోయారు. సోషల్‌ మీడియాలో పరిచయమైన వ్యక్తితో భార్య వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హుస్సేన్‌ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో టెక్కీ రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

New Update
FotoJet (6)

Two techies commit suicide

సోషల్‌ మీడియా(Social Media) లో పరిచయమైన వ్యక్తితో భార్య వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌(software-engineers) తన చావుకు భార్య, అత్తమామలే కారణమంటూ సెల్‌ఫోన్‌ స్టేటస్‌లో పెట్టుకొని  హుస్సేన్‌ సాగర్‌(hussain-sagar) లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని మార్కాపురం ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల సీతారాంకు నంద్యాలకు చెందిన యువతితో వివాహం జరిగింది. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కావడంతో బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా గతంలో టెక్కీ భార్యకు ఇన్‌స్ట్రా ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. దీంతో ఆమె ఆ వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మరి ఏం జరిగిందో తెలీదుగానీ కొద్దిరోజుల తర్వాత మళ్లీ వచ్చేసింది. ఆనాటి నుంచి భర్త సీతారం వద్ద ఉంటోంది. జనవరి 24న భర్త వద్దే పిల్లలను వదిలి భార్య ప్రియుడితో వెళ్లి పోవడంతో సీతారాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇదిలా ఉండగానే అప్పటివరకు అల్లుడి దగ్గర ఉండే అత్తమామలు, ఇద్దరు పిల్లలను తీసుకుని ఆదివారం నంద్యాలకు వెళ్లిపోయారు.అటు భార్య, ఇటు పిల్లలు వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు టెక్కీ సీతారాం. ఆదివారం సాయంత్రం తన బైక్‌పై బయల్దేరి ట్యాంక్‌బండ్‌ చేరుకున్నారు. అక్కడ వాహనం పార్కింగ్‌ చేసి హుస్సేన్‌సాగర్‌లో దూకాడు. దీన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే పోలీసులకు తెలియజేయడంతో హైడ్రా డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సోమవారం మృతదేహాన్ని బయటకు తీశారు. అతని వద్ద ప్లాస్టిక్‌ కవర్‌లో ఉంచిన సెల్‌ఫోన్‌ లభ్యమవడంతో దాని ద్వారా సీతారాంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read :  ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్.. గుట్టురట్టు చేసిన పోలీసులు!

రైల్ పట్టాల మీద తల పెట్టి సూసైడ్!

ఖైరతాబాద్(khairatabad) రైల్వే గేటు సమీపంలో ఓ యువకుడు రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య(suicide) చేసుకోవడం కలకలం రేపింది. మృతుడు వరంగల్‌కు చెందిన తరుణ్ (28)గా తెలుస్తోంది. ప్రస్తుతం ఖైరతాబాద్‌లో నివసిస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌కు చెందిన వై.తరుణ్ కు 2017లో హైదరాబాద్‌కు చెందిన ప్రసన్నతో వివాహమైంది. ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ భార్యతో కలిసి అత్తారింటికి సమీపంలోని అద్దె ఇంట్లో ఉంటు న్నారు.

తరుణ్‌ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఏడాది నుంచి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది.మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఖైరతాబాద్‌ రైల్వే గేటు సమీపంలో పట్టాలపై కనిపించడంతో విధుల్లో ఉన్న గేట్ మెన్ బయటకు పంపించారు. కాసేపటి తర్వాత రైల్వే గేట్‌కు దాదాపు వంద అడుగుల దూరంలో పట్టాలపై తల పెట్టి పడుకున్నాడు. ఆ సమయంలో నాంపల్లి వైపు వెళ్తున్న రైలు ఢీకొనడంతో తల, మొండెం వేరయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అతని పక్కన ఉన్న ఫోన్ రింగ్ అవుతోంది. పోలీసులు ఫోన్‌ లిఫ్ట్ చేసి మాట్లాడగా.. మృతుడి వివరాలు తెలిశాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నాంపల్లి జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :  సంతానం కలిగిస్తామని నమ్మించి మోసం.. నగలతో జంప్‌

Advertisment
తాజా కథనాలు