Smuggling : ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్.. గుట్టురట్టు చేసిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసు యంత్రాంగం మరో భారీ గంజాయి స్మగ్లింగ్‌ను ఛేదించింది. ఉల్లిపాయల వ్యాపారం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠాను మదనపల్లె తాలూకా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

New Update
FotoJet (7)

Police bust cannabis smuggling

అన్నమయ్య జిల్లా(annamaya-district) లో మాదకద్రవ్యాల రవాణా పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసు యంత్రాంగం మరో భారీ గంజాయి స్మగ్లింగ్‌(ganja smuggling) ను ఛేదించింది. ఉల్లిపాయల వ్యాపారం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి(cannabis smuggling) తరలిస్తున్న ముఠాను మదనపల్లె(Madanapalle News) తాలూకా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి మీడియాకు వెల్లడించారు.

ఎస్పీ ఆదేశాల మేరకు, మదనపల్లె డీఎస్పీ ఎస్. మహేంద్ర పర్యవేక్షణలో మదనపల్లె తాలూకా ఇన్స్పెక్టర్ కె. కళా వెంకటరమణ, సిబ్బంది నిన్న మదనపల్లె – తిరుపతి ప్రధాన రహదారిలోని యర్రగానిమిట్ట వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో వస్తున్న ఒక నంబర్ లేని లగేజీ ఆటోను తనిఖీ చేయగా, పైన ఉల్లిపాయల బస్తాలు పేర్చి ఉన్నాయి. పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా తనిఖీ చేయగా, ఉల్లిపాయల కింద తొమ్మిది బస్తాల్లో దాచిన దాదాపు 179 కేజీల గంజాయి బయటపడింది. దీని విలువ సుమారు రూ. 44,65,000/- (నలభై నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు) ఉంటుందని అంచనాకు వచ్చారు.

కాగా ఈ సందర్భంగా ఆటోలో ఉన్న మదనపల్లె చంద్రకాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ ఆవుల నాగరాజు, ఆవుల సుగుణలను అదుపులోకి తీసుకుని వారిపై  మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్‌లో Crime No. 49/2026 (NDPS Act) కింద కేసు నమోదు చేశారు. ఈ ముఠాలో ఉన్న మరో నలుగురు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు.

Also Read :  పాలిటిక్స్ లోకి యువరక్తం... వారసులొస్తున్నారు

యువత భవిష్యత్తుతో ఆడుకుంటే కఠిన చర్యలు – ఎస్పీ హెచ్చరిక

ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ.. "మదనపల్లె పరిసర ప్రాంతాల్లో యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. గంజాయి రవాణా చేసినా, విక్రయించినా చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడంలో సహకరించాలి" అని కోరారు. భారీ గంజాయిని పట్టుకున్న మదనపల్లె తాలూకా పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

Also Read :  ఆమెకు 37 అతనికి 17 ఇద్దరి మధ్య ఎఫైర్.. భర్త, అత్తను లేపేందుకు స్కెచ్.. చివరకు ఏం జరిగిందంటే..?

Advertisment
తాజా కథనాలు