సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య.. గొలుసుతో కట్టేసి, బ్లేడుతో కోసి
ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని అనుమానంతో అత్యంత దారుణంగా చంపిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులైన నందిని 25, వెట్రిమారన్ 26 కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నందిని మరో అబ్బాయితో క్లోజ్ ఉంటుందనే కోపంతో వెట్రిమారన్ ఆమెను గొలుసుతో కట్టేసి, బ్లేడుతో కోసి చంపాడు.