/rtv/media/media_files/2025/08/16/ceo-donation-2025-08-16-21-53-42.jpg)
I Don't Believe In Billionaires, CEO Donates Most Of $1.6 Billion Fortune
బడా వ్యాపారవేత్తలు అప్పుడప్పుడు పెద్దఎత్తున విరాళాలు కేటాయిస్తుంటారు. ఓ కంపెనీ మాజీ సీఈవో మాత్రం ఏకంగా రూ.13 వేల కోట్లు దానం ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నారు. ఇంతకీ ఆయనెవరని అనుకుంటున్నారా ? యాడ్ టెక్ కంపెనీ యాప్‌నెక్సస్ మాజీ CEO, కో ఫౌండర్ బ్రియాన్ ఓ కెల్లీ. ఫార్చున్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తాను చేసిన సాయం గురించి చెప్పుకొచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బ్రియాన్‌కు యాప్‌నెక్సస్ కంపెనీలో 10 శాతం వాటా ఉంది.
Also Read: ప్రపంచంలో మొదటిసారిగా పిల్లలు కనే రోబోలు.. ఎక్కడో తెలిస్తే షాక్!
2018లో ఆయన ఈ కంపెనీని ఎటీఅండ్ టీ సంస్థకు అమ్మేశారు. దీన్ని విక్రయించడంతో ఆయనకు 1.6 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ.14 వేల కోట్ల) ఆదాయం వచ్చింది. అంత మొత్తంలో డబ్బులు వచ్చినప్పటికీ ఆయన ఆ సంపదను ముట్టుకోలేదు. కేవలం తన కుటుంబ భవిష్యత్తు అవసరాల కోస మాత్రం 100 మిలియన్ డాలర్లు ఉంచుకున్నారు. మిగతా 1.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.13 వేల కోట్లు) వివిధ ఛారిటీ సంస్థలకు విరాళంగా ఇచ్చారు. తాను నిరాడంబర జీవన విధానాన్ని కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. బిలియనరీగ్ ఉండటం తనకు ఇష్టం లేదని.. అదంతా హాస్యాస్పదంగా అనిపిస్తుందని చెప్పారు.
Also Read: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం: ట్రంప్
అందుకోసమే తన కుటుంబం కోసం ఎంత డబ్బు అవసరమో అంత ఉంచుకున్నానని.. మిగతంతా విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయం గురించి తన భార్యతో కూడా చర్చించానని.. కుటుంబం కోసం 100 మిలియన్ డాలర్లు ఉంచుకోవాని భావించామని తెలిపారు. బిలియనీర్ జీవనశైలి కూడా తనకు నచ్చదని.. పిల్లలను లగ్జరీగా పెంచడం కంటే, వాళ్లకు జీవితం విలువలను నేర్పించడం మంచిదని చెప్పారు. ఈ కంపెనీని అమ్మిన తర్వాత.. బ్రియాన్ స్కోప్-3 అనే స్టార్టప్ సంస్థను ప్రారంభించారు.
Also Read: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళిని అంతం చేస్తుంది: గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ