/rtv/media/media_files/2025/06/14/tXorGubKGn0FbEdX91QF.jpg)
Manipur weapons operation
Manipur weapons operation : నిత్యం అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో హింసను తగ్గించేందుకు పోలీసులు స్పెషల్ ఆఫరేషన్ నిర్వహించారు.ఈ ఆఫరేషన్‌లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్ అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు, CAPF, భారత సైన్యం, BSF, CRPF, ITBP వంటి భద్రతా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో అత్యాధునిక ఆయుధాలతో పాటు చిన్న చితకా అన్ని కలిపి సుమారు 400 లకు పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
మణిపూర్‌లో అల్లర్లతో చెలరేగిన హింస నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. అయితే రాష్ట్రపతి పాలన ఉన్నప్పటీకీ పలు ప్రాంతాల్లో నిత్యం దాడులు, హింస, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాడులు చేస్తున్న వారి వద్ద మరణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో భద్రతా దళాలు స్పెషల్ ఆఫరేషన్ నిర్వహించాయి. జూన్ 13-,14 తేదీల్లో మణిపూర్ ఇంఫాల్ లోయలో ఉన్న ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబల్, బిష్ణుపూర్, కాక్చింగ్ ఐదు జిల్లాల సరిహద్ధుల్లో ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ఆఫరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లలో 400కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా పోలీసులు 328 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 9,300 రౌండ్ల వివిధ రకాల మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు, ఇతర యుద్ధ సంబంధిత సామగ్రిని కూడా పట్టుకున్నారు. పోలీసులకు చిక్కిన ఆయుధాలలో 151 సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్ (SLR), 65 INSAS రైఫిల్స్, 73 ఇతర రకాల రైఫిల్స్, 12 లైట్ మెషిన్ గన్స్ (LMG), 6 AK సిరీస్ రైఫిల్స్, 5 కార్బైన్స్, 6 పిస్టల్స్, 2 MP-5 గన్స్ తదితరాలు ఉన్నాయి. కాగా ఇలాంటి ఆధునిక ఆయుధాలు వీరికి ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.