Kavitha: నాపై కుట్ర చేసి బయటకు పంపారు.. కవిత సంచలన ఆరోపణలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర చేసి బయటికి పంపించారని ఆరోపించారు. గత 20 ఏళ్లుగా కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కోసం పనిచేశానని పేర్కొన్నారు.

New Update
they conspired on me, sent out from Party, Says Kavita

they conspired on me, sent out from Party, Says Kavita

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర చేసి బయటికి పంపించారని ఆరోపించారు. గత 20 ఏళ్లుగా కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ(brs) కోసం పనిచేశానని పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్‌లో 'జాగృతి జనం బాట' ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. '' నిజామాబాద్‌లో నేను ఓడిపోవడం వెను కుట్ర ఉందో లేదే బీఆర్ఎస్‌ కార్యకర్తలు ఆలోచన చేయాలి. ఇంటి గుట్టు బయటపెట్టి కుట్ర చేసి నన్ను బయటికి పంపించేశారు. ఇప్పుడు నేను నా దారిని వెతుక్కుంటున్నాను. 

Also Read: ఢిల్లీ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. యమునా నీళ్లు తాగాలంటూ ఆప్‌ నేతల ఆందోళనలు

Kavitha Sensational Comments

27 ఏళ్ల వయసులోనే రాష్ట్ర ఉద్యమంలోకి వచ్చాను. ఎప్పుడూ కూడా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. నాపై ఎన్ని అవమానాలు జరిగినప్పటికీ భరించాను. ఇప్పుడు మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. నేను వేసే తొలి అడుగు మన గడ్డ మీద నుంచే వేయాలని ఇక్కడికి వచ్చాను. గత 10 ఏళ్లలో మనం కొంత సాధించుకున్నప్పటికీ అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన న్యాయం, గౌరవం దక్కలేదు.   

Also Read: తెలంగాణ సర్కార్ షాకింగ్‌ నిర్ణయం.. ఆ ఉద్యోగులకు జీతాలు లేనట్టే ?

వీటికోసం మనమందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. జనం బాటలో భాగంగా విద్యార్థులు, మేధావులతో పాటు అన్ని వర్గాలతో మాట్లాడుతా. ఇందులో అందర్నీ భాగస్వాములను చేస్తాను. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని కోరుతున్నానని'' కవిత అన్నారు.

Also Read: హైదరాబాద్ లో కాల్పుల కలకలం..సెల్‌ఫోన్‌ దొంగలపై డీసీపీ ఫైరింగ్

Advertisment
తాజా కథనాలు