Yamuna River: ఢిల్లీ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. యమునా నీళ్లు తాగాలంటూ ఆప్‌ నేతల ఆందోళనలు

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు యమునా నది నుంచి మురికి నీటిని ఓ బాటిల్‌లో సేకరించారు. ఆ బాటిల్‌లోని నీటిని సీఎం రేఖ గుప్తా తాగాలంటూ ఆందోళనలు చేశారు.

New Update
AAP brings Yamuna water to CM Rekha gupta door

AAP brings Yamuna water to CM Rekha gupta door

ఢిల్లీ(delhi)లో యమునా నది(yamuna-river) కాలుష్యంపై గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తూనే ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాము అధికారంలోకి వస్తే యమునా నదిని శుద్ధి చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు యమునా నది నుంచి మురికి నీటిని ఓ బాటిల్‌లో సేకరించారు. ఆ బాటిల్‌లోని నీటిని సీఎం రేఖ గుప్తా తాగాలంటూ డిమాండ్ చేశారు. 

AAP Brings Yamuna Water To CM Rekha Gupta Door

Also Read: మదర్ రాక్..డాటర్స్ షాక్..కూతుళ్లు నిద్ర లేవడం లేదని ఓ తల్లి ఏం చేసిందంటే..?

బీజీపీ యమునా నదిని శుభ్రం చేసినట్లు భావిస్తే ఈ సవాలును స్వీకరించాలని ఆప్ ఢిల్లీ యూనిట్ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు. ఛత్ పూజకు ముందే బీజేపీ అబద్ధాలను వ్యాప్తి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ సర్కార్‌ నెలల తరబడి యమునా నదిని శుద్ధి చేసిన తర్వాత ఆ నీరు ఆచారాలకు అనుకూలంగా ఉన్నట్లు ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి అనిల్‌ గుప్తా పేర్కొన్నారు. గురువారం ఆయన ఆ నీటిని తాగారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది.  

Also Read: అమెరికా చేతిలోకి పాకిస్థాన్ అణుబాంబులు.. సంచలన నిజం బయటపెట్టిన మాజీ CIA అధికారి

దీనిపై స్పందించిన సౌరభ్‌ భరద్వాజ్‌ బీజేపీ అబద్ధాల వల్ల యమునా నదిని శుభ్రం చేశారని లక్షలాది మంది పూర్వాంచల్ మహిళలు, చిన్నారులు భావిస్తారని ఆరోపించారు. ఛత్‌ పూజ సందర్భంగా ఆ నీటిని తాగుతారని.. ఆ తర్వాత వాళ్లు ప్రాణాంతక అనారోగ్యానికి గురవుతారన్నారు. ఇదిలాఉండగా ఛత్‌ పూజ అక్టోబర్ 25 నుంచి 28 వరకు నిర్వహించున్నారు. 

Also Read: ఒసామా బిన్ లాడెన్ ఆడ వేషంలో త‌ప్పించుకున్నాడు.. వెలుగులోకి కీలక విషయాలు

Advertisment
తాజా కథనాలు