Telangana Govt : తెలంగాణ సర్కార్ షాకింగ్‌ నిర్ణయం.. ఆ ఉద్యోగులకు జీతాలు లేనట్టే ?

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు.. రాష్ట్ర ఆర్థిక శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల జీతాలు నిలిపివేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25 లోపు తప్పనిసరిగా ఆధార్ అప్‌డేట్ చేయాలని ఆదేశించింది.

New Update
Govt Employees Strike

Govt Employees

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు.. రాష్ట్ర ఆర్థిక శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల జీతాలు నిలిపివేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25 లోపు తప్పనిసరిగా ఆధార్ అప్‌డేట్ చేయాలని ఆదేశించింది. ఉద్యోగులు తమ ఆధార్, ఫోన్ నంబర్ వివరాలు IFMIS పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించింది. అలా చేయని ఉద్యోగులకు ఈ నెల జీతం నిలిపివేస్తామని స్పష్టం చేసింది. అక్టోబర్ 25 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని, లేనిపక్షంలో ఈ నెల జీతాలు ఆగిపోతాయని ఆదేశించింది. అక్రమాలను అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.  

కాగా,  ప్రభుత్వ అన్ని శాఖల్లో కలిపి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు మొత్తం 10.14 లక్షల మంది ఉన్నారు. వీరందరి పేర్లు, హోదా, ఆధార్, ఫోన్‌ నంబర్లు తదితర వివరాలన్నీ ప్రతి నెల 10 వరకు ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్‌(IFMIS)లో నమోదు చేయాలని ప్రభుత్వం గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ నెల 16 వరకు కూడా సగం మంది వివరాలు కూడా నమోదు చేయలేదు. ఈ క్రమంలో వివరాలివ్వనివారి జీతాలు నిలిపివేసింది. మిగిలిన వారు వెంటనే వివరాలు ఇవ్వాలని లేకపోతే.. ఇదే ట్రీట్మెంట్ అమలవుతుందని హెచ్చరించింది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పని చేస్తోన్న ఉద్యోగుల వివరాలు ఆఫీసుల్లో లేవా.. వాటిని ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయడం సాధ్యం కాదా  ప్రభుత్వం ప్రశ్నించింది. ఈ వివరాలు ఇవ్వని ఉద్యోగులకు ఈ నెల జీతం రాదని హెచ్చరించింది.

 ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో.. శాశ్వత, టెంపరరీ ఉద్యోగులు అందరూ కలిపి మొత్తం 10.14 లక్షల మంది ఉన్నారని తెలిపింది. వీరందరి పేర్లు, హోదా, ఆధార్, ఫోన్‌ నంబర్లు తదితర వివరాలన్నింటిని ప్రతి నెల 10 వరకు ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్‌(ఐఎఫ్‌ఎంఐఎస్‌)లో నమోదు చేయాలని గత నెలలోనే ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సగం మంది ఉద్యోగులు కూడా వారి వివరాలు నమోదు చేయలేదు.ఈ క్రమంలో వివరాలివ్వని ఉద్యోగుల జీతాల బిల్లులు అక్టోబర్ నెలలో ఆమోదించేది లేదని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.

 రాష్ట్రంలో మొత్తం 5.21 లక్షల మంది శాశ్వత ఉద్యోగులున్నారు అయితే.. వారిలో కేవలం 2.22 లక్షల మంది మాత్రమే వారి వివరాలు నమోదు చేశారు. అలానే రాష్ట్రంలో మొత్తం 4.93 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉండగా.. వారిలో కేవలం 2.74 లక్షల మంది వివరాలే నమోదు చేయించుకున్నారు. విద్యుత్‌శాఖలో 95,394 మంది ఉద్యోగులు ఉంటే.. వారిలో కేవలం కేవలం 53 మంది, ఎస్సీ సంక్షేమశాఖలో 14,267 మంది ఉద్యోగులు ఉండగా వారిలో కేవలం 2,223 మంది.. పోలీసుశాఖలో 1,04,189 సిబ్బంది ఉండగా.. వారిలో కేవలం 48,383 మంది మాత్రమే తమ వివరాలనే అప్‌లోడ్‌ చేశారు. ఏ ఒక్క శాఖలో కూడా వంద శాతం ఉద్యోగుల వివరాలు నమోదు చేయలేదని ప్రభుత్వం తెలిపింది. అయితే అక్టోబర్ 25లోగా అందరూ వివరాలు నమోదు చేయాలని.. చేయని ఉద్యోగుల జీతాలు కట్ చేస్తామని ఆర్థిక శాఖ హెచ్చరించింది.

Advertisment
తాజా కథనాలు