/rtv/media/media_files/2025/02/05/RKIdc7CXMQsfVTnIhImg.jpg)
pinky reddy
Pinky Reddy: ప్రముఖ వ్యాపార వేత్త, జీవీకే గ్రూప్స్ వారసుడు జీవీ సంజయ్ రెడ్డి భార్య పింకీ రెడ్డి ఫోన్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ''పింకీ రెడ్డి అధికారిక ఫోన్ హ్యాక్ చేయబడింది! దయచేసి ఎటువంటి సందేశాలను ప్రత్యుత్తరం లేదా డబ్బు పంపవద్దు!'' అంటూ పోస్ట్ పెట్టారు.
Also Read: Thandel Movie: కెరీర్ లో హయ్యస్ట్ రెమ్యునరేషన్.. తండేల్ కోసం చై, పల్లవి ఎంత తీసుకున్నారంటే!
/rtv/media/media_files/2025/02/05/BbPoViIap5ziOsmtoJKH.png)
Also Read: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా థాయిలాండ్!
వ్యాపార వేత్తగా..
పింకీ రెడ్డి ఆమె తండ్రి మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి వలే వ్యాపారంలోనూ, సేవా సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేస్తు ముందుకెళ్తున్నారు. అపర్ణా ఫౌడేషన్ పేరుతో సేవా సంస్థను ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సౌత్ ఇండియా సెలబ్రిటీగా వెలుగొందుతున్నారు. పింకీ రెడ్డి 'ది లోటస్ ఫౌండేషన్' అనే సంస్థను కూడా స్థాపించారు. దీని ద్వారా వారసత్వ సంస్కృతి నుంచి కనుమరుగవుతున్న కళారూపాలను, చేతివృత్తులవారిని పునరుద్ధరిస్తున్నారు. అంతేకాదు ఆమె FICCI FLO అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. టాలీవుడ్, బాలీవుడ్ లో పలువురు సెలెబ్రెటీలతోనూ ఆమెకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సెలెబ్రెటీలకు సంబంధించిన పలు ఈవెంట్లలో కూడా కనిపిస్తుంటారు.
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?