/rtv/media/media_files/2025/02/05/JAoe8IZVyyu7OqKJiPAi.jpg)
Blade batch
AP News: విజయవాడలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడీపేటలో బ్లేడ్‌బ్యాచ్ వీరంగం సృష్టించారు. ఇద్దరు యువకులపై దాడి చేశారు. తీవ్రగాయాలైన యువకులను ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడీపేటలోని గాంధీబొమ్మ కాలనీలో నివాసం ఉంటే గుర్రం శ్రీకాంత్, ప్రసాద్ థియేటర్‌లో ఉండే అబ్దుల్ మున్వర్ ఇద్దరు మంచి స్నేహితులు. స్నేహితులిద్దరు కేఎల్‌రావు పార్కు దగ్గర టీ తాగి ఇంటికి బైక్‌పై వెళ్తున్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న బక్కి అలియాస్ పులపాక, దాసుకు అతి దగ్గరగా ఆపాట వలన ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది.
రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్:
వీరికి శ్రీకాంత్ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా వినకుండా.. శ్రీకాంత్‌ను బక్కి కొట్టాడు. కొద్ది సేపటికి పని మీద బయటకు వెళ్తున్న.. స్నేహితులిద్దరికి బక్కితోపాటు అతని స్నేహితుడైన నాగు ఎదురుపడి వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో బక్కి, నాగులు వారి వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో మున్వర్ కుడిచేతి మణికట్టు దగ్గర, శ్రీకాంత్ మెడ భాగంలో కోశారు. దీంతో వారికి తీవ్ర గాయమైంది. ఈ దాడిలఓ మున్వర్ చేతి మణికట్టు తగ్గర నరాలు తెగాయి. తీవ్రగా గాయపడిన వారిని చూసి స్థానికులు దగ్గరకు రాకుండా వారిని చూసి భయంతో పరుగులు తీశారు. దాడిపై విషయం తెలుసుకున్న మున్వర్ కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చారు.
ఇది కూడా చదవండి: షుగర్ లెవెల్ 300 దాటితే వెంటనే ఈ చెట్టు ఆకులను నమలండి
అనంతరం గాయాలు ఉన్న అతన్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వెంటనే మున్వీర్‌కు ఆపరేషన్ చేశాడు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. గోడవపై బాధితుల ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. బ్లేడ్‌తో దాడికి పాల్పడిన ఇద్దరు రౌడీషీట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు. మరో మారు ఇటువంటి దాడులకు పాల్పడకుండా శిక్షంచాని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: గర్భిణులకు మెహందీ హానికరమా.. నిపుణులు ఏమంటున్నారు?