/rtv/media/media_files/2025/02/05/pOfjvjEkZ94bHzRa4i8j.jpg)
sreeja marriage
కట్నం వేధింపులతో నవ వధువు సూసైడ్ చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి గ్రామానికి చెందిన శ్రీజ(21)కు వికారాబాద్ సకేత్ నగర్ కు చెందిన సాయికుమార్ కు 2024 నవంబర్ లో పెళ్లైంది. పెళ్లిలో18 తులాల బంగారం, రూ.3 లక్షలు, బైక్ తదితర వస్తువులు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు శ్రీజ కుటుంబ సభ్యులు. పెళ్లాయ్యాక కొద్దిరోజులు వీరి కాపురం సజావుగానే సాగింది.
Also Read : తండేల్ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పిన గవర్నమెంట్
ఆ తర్వాత అదనపు కట్నం తేవాలని భర్త సాయికుమార్, అత్త మామలు రాజమణి, అనంతయ్య కలిసి శ్రీజను వేధించడం మొదలు పెట్టారు. ఇదే విషయంలో పలుమార్లు ఇంట్లో గొడవలు కూడా జరిగాయి. దీంతో పెద్దలు మధ్య పంచాదీ కూడా జరగగా సర్దిచెప్పారు. అయినా అత్తింటి వారి నుంచి శ్రీజకు వేధింపులు ఆగకపోవడంతో మంగళవా రం ఉదయం శ్రీజ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
Also Read : మహాకుంభమేళాకు చేరుకున్న మోదీ... త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం
శ్రీజ మృతిపై అనుమానాలు
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే శ్రీజ చనిపోయినట్లుగా వైద్యులు వెల్లడించారు. తమ కూతురు శ్రీజ మృతిపై అనుమానాలు ఉన్నాయని, ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ శ్రీజ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. శ్రీజను అత్తింటి వారు వరకట్నం కోసం వేధించారని, సోమవారం రాత్రి తన తమ్ముడికి శ్రీజ ఫోన్ చేసి రూ.3 లక్షలు కావాలని కోరినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Also Read : MP Pappu Yadav: రాజకీయ నాయకులు కుంభమేళాలో చనిపోవాలి
Also Read : Rohit sharma : బిగ్ షాక్.. రోహిత్ రిటైర్‌మెంట్ ఫిక్స్.. కోహ్లీ కూడా!
Follow Us