Tesla Cars: హైదరాబాద్‌లో పరుగులు పెట్టనున్న టెస్లా కార్లు..

సోమవారం ఢిల్లీలోని టెస్లా కంపెనీ తమ రెండో షోరూమ్‌ను కూడా టెస్లా ప్రారంభించింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల్లో స్టేషన్లు విస్తరించనున్నారు. మరికొన్ని రోజుల్లోనే హైదరాబాద్‌లో కూడా టెస్లా కార్లు పరుగులు పెట్టనున్నాయి.

New Update
Tesla Charging station to be set up in Hyderabad

Tesla Charging station to be set up in Hyderabad

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంను ఇటీవల భారత్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. సోమవారం ఢిల్లీలోని తమ రెండో షోరూమ్‌ను కూడా టెస్లా ప్రారంభించింది. సుమారు 8200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కంపెనీని అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే  నోయిడా, ఆరిజన్, సాకేత్ తదితర ప్రాంతాల్లో సూపర్‌ఛార్జర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవలే టెస్లా తమ తొలి షోరూమ్‌ను ముంబయిలో ప్రారంభించింది. అలాగే మొదటి సూపర్‌ ఛార్జర్ స్టేషన్‌కు కూడా ఏర్పాటు చేసింది .

Also Read: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. మరో ఐదు రోజులు వానలే వానలు

అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్, జయపుర వంటి ఎనిమిది నగరాల్లో ఛార్జింగ్‌ స్టేషన్లు విస్తరించనుంది. అంటే మరికొన్ని రోజుల్లోనే హైదరాబాద్‌లో కూడా టెస్లా కార్లు పరుగులు పెట్టనున్నాయి. అంతేకాదు మరో కొత్త షోరూమ్‌ను కూడా హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. దీంతో ఇక్కడి ప్రజలు కూడా టెస్లా కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపనున్నారు. అయితే టెస్లా కారును వీ4 సూపర్‌ ఛార్జర్‌తో ఛార్జింగ్ చేస్తారు. ఇందుకోసం కిలోవాట్‌కు రూ.24 వసూలు చేస్తారు. ఇక 11 కిలోవాట్‌ అవర్‌ స్పీడ్‌ ఉండే ఏసీ ఛార్జింగ్‌కు కిలోవాట్‌ ధర రూ.11గా ఉంది. అయితే వీ4 సూపర్‌ ఛార్జర్‌ అనేది చాలా తొందరగా ఛార్జ్‌ అవుతుంది. ఇటీవల కొత్తగా లాంచ్‌ చేసిన టెస్లా మోడల్‌ వై కారును కేవలం 15 నిమిషాల్లోనే ఛార్జ్ చేస్తుంది. దీంతో 267 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.  

Also Read: హెచ్ 1 బీ భారత వీసాదారులకు మరో షాక్...గ్రీన్ కార్డ్ ఇక మీ పిల్లలకు పని చేయదు..

మరోవైపు దేశీయ మార్కెట్‌లో టెస్లా కార్లను రెండు వేరియంట్లలతో తీసుకొచ్చారు. మోడల్ Y RWD(స్టాండర్డ్‌ రేంజ్) వేరియంట్ ప్రారంభ ధర రూ.59.89 లక్షలుగా నిర్ణయించారు. ఇక మోడల్ Y RWD (లాంగ్ రేంజ్) ధర రూ.67.89 లక్షలు ఉంది. ఈ కారును ఒకసారి ఫుల్‌ఛార్జ్‌ చేస్తే 500 నుంచి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు .  

Also Read: లేడీ అఘోరీ శ్రీనివాస్‌కి భారీ ఊరట .. బెయిల్ మంజూరు

ఈ ధరలు అనేవి షోరోమ్‌ ధరలు, ఆన్‌రోడ్, రాష్ట్ర పన్నులు, బీమీ, ఇతర ఛార్జీలను బట్టి మారుతుంటాయి. హైదరాబాద్‌లోకి టెస్లా కార్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇదిలాఉండగా ఇప్పటికే అన్ని దేశాలు కూడా గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తు్న్నాయి. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని సూచిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది ఎలక్ట్రిక్ బైక్స్‌ను వాడుతున్నారు. ఎలక్ట్రిక్ కార్ల వాడకం కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఇక రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకే ఎక్కువగా డిమాండ్ ఉండనుంది. అంతేకాదు ఆయా రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి పలు ఛార్జీలను కూడా తగ్గిస్తున్నాయి . 

Also Read: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బిగ్‌షాక్..పార్టీ నుంచి ఔట్?

Advertisment
తాజా కథనాలు