/rtv/media/media_files/2025/08/11/komatireddy-2025-08-11-18-53-58.jpg)
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సీఎం రేవంత్‌రెడ్డిని పదేపదే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డిని పార్టీలో నుంచి పంపేందుకు రంగం సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డితో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశాలతో పాటుగా ప్రధానంగా రాజగోపాల్ వ్యవహారంపై సీఎం చర్చించినట్లుగా తెలుస్తోంది. రాజగోపాల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ప్లాన్‌లో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
అటు సీఎం రేవంత్‌రెడ్డిపై కోమటిరెడ్డి బహిరంగంగా చేసిన విమర్శలపై పార్టీ హైకమాండ్‌కు కూడా నివేదికలు వెళ్లాయి. ఏఐసీసీ కూడా ఈ విషయంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా చర్చించడం సరికాదని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. పార్టీకి నష్టం జరగకుండా ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని అధిష్టానం చూస్తున్నట్లు సమాచారం. అయితే రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటి వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తనకు మంత్రి పదవి రాకపోవడంపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని, అందుకే సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హైదరాబాద్ వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే ఎంపీ మల్లు రవి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందని, అయితే ఆ హామీని రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటున్నారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హైకమాండ్ రాజగోపాల్ రెడ్డికి పదవిపై హామీ ఇచ్చిన మాట వాస్తవేమేనని కానీ అది కేబినెట్ కూర్పులో కుదరలేదన్నారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.సీఎం రేవంత్‌రెడ్డి పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా ఖండించారు. ముఖ్యమంత్రి ఎవరు అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ విధానాలకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, ప్రతిపక్షాలపై సీఎం ఉపయోగించే భాషను మార్చుకోవాలని కూడా సూచించారు.