Weather Update: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. మరో ఐదు రోజులు వానలే వానలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు ఐదు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

New Update
Rains

Rains

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు ఐదు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు వెళ్లకూడదని తెలిపారు. ఐదు రోజుల పాటు అతి భారీ వర్షాలు ఉండటంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో అయితే బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: Coolie vs War 2 Bookings: 'కూలీ' అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సేషన్.. తలైవా ర్యాంపేజ్ మాములుగా లేదుగా..!

తెలంగాణలో ఈ జిల్లాల్లో..

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల తెలంగాణలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

ఏపీలోని ఈ జిల్లాల్లో..

ఏపీలో విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే మత్స్యకారులు అసలు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రతీర ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలను సూచించారు. 

ఇది కూడా చూడండి:Trump: అమెరికాలో అల్లకల్లోలం.. రాజధానిలో భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్.. అసలేం జరుగుతోంది?

Advertisment
తాజా కథనాలు