/rtv/media/media_files/2025/04/06/ZnTgiOWkE0LEmFkkPoPV.jpg)
Aghori coming from Kashi to Hyderabad released a video Photograph: (Aghori coming from Kashi to Hyderabad released a video)
ఎన్నో నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీ శ్రీనివాస్‌కి భారీ ఊరట లభించింది. తాజాగా బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు. 10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. అంతేకాకుండా ప్రతి గురువారం కొత్తపల్లి పీఎస్‌లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో అఘోరి శ్రీనివాస్ రేపు జైల్ నుంచి విడుదల కానున్నాడు. కరీంనగర్ కొత్తపళ్లికి చెందిన ఓ యువతి అఘోరీ శ్రీనివాస్‌పై కేసు పెట్టింది.
సనాతన ధర్మం పేరుతో పరిచయం
సనాతన ధర్మం పేరుతో పరిచయం చేసుకున్న శ్రీనివాస్.. తనకు కొండగట్టులో తాళి కట్టి అత్యాచారయత్నం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బెదిరించి రూ.3 లక్షలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిందని, బలవంతంగా ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు వేసిందని బాధితురాలు ఆరోపించింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అఘోరీపై 64(1), 87 318(4) 351(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద శ్రీవర్షిణి ఉంది. సఖి సెంటర్లో పోలీసుల కౌన్సిలింగ్ తర్వాత వర్షిణి మీడియా ముందుకు రాలేదు. కాగా ఇప్పటికే ఓ మహిళ ప్రొడ్యూసర్ ను బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు అతడిపై కేసు నమోదు కాగా ఆ కేసులో అఘోరీకి ఊరట లభించింది. అఘోరి శ్రీనివాస్‌కు చేవెళ్ల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Also Read : SPG officer Adasso Kapesa: మోదీకి రక్షణగా SPG తొలి మహిళా ఆఫీసర్.. ఎవరీ అదాసో కపేసా..?
మహిళా ప్రొడ్యూసర్ నుంచి 10 లక్షలు
గతంలో రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ అఘోరీపై చీటింగ్ కేసు పెట్టింది. 6 నెలల క్రితం ప్రొద్దుటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయ్యింది. తర్వాత తరుచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మహిళా ప్రొడ్యూసర్‌కు మాయ మాటలు చెప్పింది అఘోరీ . క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాస్‌గా రూ.5 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది అఘోరీ. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది. దీంతో పూజల పేరుతో ఆ మహిళ నుంచి 10 లక్షలు కాజేసి.. మోసం చేసిన కేసులో అఘోరిని అరెస్ట్ చేశారు.
Also Read : Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాన్ లోయలో పడి 8 మంది మహిళలు మృతి