Hydra: బసవతారకం ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..రూ. 750 కోట్ల భూమికి హైడ్రా విముక్తి

హైదరాబాద్‌లో  హైడ్రా కూల్చివేతలు మళ్లీ కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించి విముక్తి కలిగించారు.

New Update
Rs. 750 crore land to be freed by Hydra

Rs. 750 crore land to be freed by Hydra

HYDRA : హైదరాబాద్‌(hyderabad) లో  హైడ్రా కూల్చివేతలు(HYDRAA demolition drive) మళ్లీ కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించి విముక్తి కలిగించారు.

ఇది కూడా చూడండి: Sad news : పంజాబీ నటుడు, బాడీ బిల్డర్‌ వీరేందర్‌ గుహ్‌మన్‌ మృతి...శోక సముద్రంలో పంజాబ్

Tension At Basavatarakam Hospital

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. స్థలాన్ని పరిశీలించారు. అది పూర్తిగా ప్రభుత్వ భూమి అని అందులోని ఆక్రమణలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో, శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు.. అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో భూమి కబ్జా చేసిన వీఆర్‌ ఇన్‌ఫ్రా పార్థసారథి, ఆయన కుమారుడు విజయ్‌ భార్గవా అధికారులతో వాగ్వివాదానికి దిగినట్లు తెలుస్తోంది. అయినా వెనుకడుగు వేయని అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. కాగా, వీఆర్‌ ఇన్‌ఫ్రా పార్థసారథి, ఆయన కుమారుడు విజయ్‌ భార్గవా భూమిని కబ్జా చేసినట్టు హైడ్రా అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: Illegal Betting Case : కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఈడీ దాడులు...కోట్లాది డబ్బు..కిలోలకొద్ది బంగారం..

అలాగే షేక్‌పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్-10లోనూ  ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. గతంలో ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఐదు ఎకరాల్లో జలమండలికి 1.20 ఎకరాలను కేటాయించింది. అయితే 1.20 ఎకరాలతో పాటు మొత్తం ఐదు ఎకరాల భూమి తనదే నంటూ పార్థసారథి కోర్టుకెక్కారు. అంతేకాక, ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేటకుక్కలతో కాపాలా పెట్టాడు. కాగా, ఈ వివాదం కోర్టులో కొనసాగుతుండగానే మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొన్న పార్థసారథి అందులో షెడ్డులు నిర్మించుకున్నాడు.

Also Read :  హైదరాబాద్‌లో రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్

నిజానికి  403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్ వేసి పార్థసారథి ఆక్రమణలకు పాల్పడినట్టు హైడ్రా గుర్తించింది. ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్‌తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేసుకున్నట్లు హైడ్రా నిర్ధారించింది. ఈ మేరకు అందులోని కట్టడాలను కూల్చివేసిన హైడ్రా ఆ 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. 

ఇది కూడా చూడండి: Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరించకూడదు..ప్రభుత్వ సంచలన నిర్ణయం

Advertisment
తాజా కథనాలు